Bigg Boss 9 grand finale final promo out now
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం అయ్యింది. విన్నర్ ఎవరో తెలుసుకునే సమయం కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో విన్నర్ తెలియబోతుంది అనే ఉత్కంఠతో ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఎప్పుడెప్పుడు ఆ క్షణం వస్తుందా అని ఆతృతగా చూస్తున్నారు. టాప్ 5 నుంచి కూడా ఇప్పటికే ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. టాప్ 5లో తనూజ,(Bigg Boss 9 Telugu) కళ్యాణ్, డెమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉండగా. వీరిలో నుంచి సంజన, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్టుగా తెలిసిపోయింది.
Revolver Rita OTT: ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. “రివాల్వర్ రీటా” స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
ఇక మిగిలింది ముగ్గురు. ఆ ముగ్గురిలో కూడా టాప్ 2 తనూజ, కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోయింది. ఈ ఇద్దరిలో గట్టి పోటీ నడుస్తోంది. కొంతమంది తనూజ విన్నర్ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ విన్నర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆడియన్స్ ఈ ఉత్కంఠతో ఉండగా కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ తాజాగా గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో చాలా ట్విస్టులను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే విన్నర్ ఎవరు అనేది చెప్పకుండానే చెప్పేసినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు.
ఈ ప్రోమో చూస్తుంటే ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ ను అందేలా ప్లాన్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. అక్కడివరకు బాగానే ఉన్నా.. బిగ్‌బాస్ 9 ట్రోఫీని చూపించినప్పుడు మాత్రం ‘మగువా మగువా’ అనే పాటను వేశారు. లేడీస్ కి సంబందించిన ఎమోషనల్ సింగ్ కాబట్టి విన్నర్ తనూజ అని చెప్పకనే చెప్పారు అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. మరి అది నిజమేనా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.