Revolver Rita OTT: ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. “రివాల్వర్ రీటా” స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ 'రివాల్వర్ రీటా(Revolver Rita OTT)'. లేడీ ఓరియెంటెడ్ కథతో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే ముగిసినా పలు వాయిదాల తరువాత నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Keerthy Suresh Revolver Rita movie OTT streaming update
Revolver Rita OTT; మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’. లేడీ ఓరియెంటెడ్ కథతో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే ముగిసినా పలు వాయిదాల తరువాత నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఆడియన్స్ నుంచి మాత్రం నెగిటీవ్ టాక్ ను తెచ్చుకుంది. దసరా తరువాత కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఇది. అయినప్పటికీ ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేదు ఈ సినిమా. అందుకే, ఈ సినిమాను రిజెక్ట్ చేశారు ఆడియన్స్. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
రివాల్వర్ రీటా ఓటీటీ(Revolver Rita OTT) హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి అంటే థియేటర్స్ లో విడుదలైన సరిగ్గా నెలరోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనీ ప్లాన్ చేశారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం. ఇక, ఈ న్యూస్ తెలియడంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ అయిన రివాల్వర్ రీటా సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
