Bigg Boss 9 Telugu third week nominations
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి ఆట రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ.. ఆటతో వాటిని కవర్ చేస్తున్నాడు బిగ్ బాస్. వారవారం ఆటను మార్చుతూ.. సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడు. (Bigg Boss 9 Telugu)దానికి తగ్గట్టుగా కంటెస్టెంట్స్ రియాక్ట్ అవుతూ ఉండటంతో మంచి మజా వస్తోంది. ఇక రెండో వారానికి గాను ఇంటినుంచి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ వారం ఆటను కొత్తగా టర్న్ చేశాడు బిగ్ బాస్.
ఈ సీజన్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గా మొదలుపెట్టాడు. కానీ, మూడవ వారం నుంచి ఆటను మార్చి ఓనర్స్ టెనెంట్స్ గా టెనెంట్స్ ని ఓనర్స్ గా మార్చేశాడు. దాంతో, ఇంతకాలం ఆటలు సాగించిన ఓనర్స్ తోకలు ముడుచుకుపోయాయి. ఇప్పుడు సెలబ్రెటీలకు ఫుల్ పవర్స్ వచ్చాయి. ఆ పవర్ ను మూడవ వారం నామినేషన్స్ నుంచే మొదలుపెట్టారు ఓనర్స్. దీంతో దిమ్మ తిరిగే కౌంటర్ తగిలింది టెనెంట్స్ కి అంటే కామనర్స్ కి. మూడవ వారం నామినేషన్స్ ప్రక్రియ అదిరిపోయే రేంజ్ లో జరిగింది. ఒక్కరిని కూడా మిగిల్చ కూడా అందరు కామనర్స్ ను నామినేషన్స్ లో పెట్టారు సెలబ్రెటీస్.
ఇక నామినేషన్స్ ప్రక్రియ వాడివేడీగానే జరిగింది. కామనర్ పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య చిన్న సైజ్ మాటల యుద్ధమే జరిగింది. అసలు నువ్వు ఇంకా గేమ్‌లోకి దిగలేదంటూ ఇమ్మాన్యుయేల్ అనగా.. పక్కనోడి పాయింట్స్ తో నాకేం పని కౌంటర్ ఇచ్చాడు పవన్. ఇక శ్రీజ దమ్ము, రీతూ చౌదరి మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది.నవ్వు వెళ్లు అని శ్రీజ అనగా.. అలా చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ రెచ్చిపోయింది రీతూ. ఈ ఇద్దరి మధ్యకు హరీశ్ ఎంట్రీ ఇచ్చాడు. మా అందరినీ నామినేషన్స్‌లో పెట్టడమే మీ గేమ్ కదా అంటూ వాదించాడు. మొత్తానికి ఈవారం మొత్తం కామనర్స్ అందరు నామినేషన్స్ లో ఉన్నట్టు క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఫైనల్ గా బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చి సెలబ్రెటీలలో ఎవరినైనా నామినేషన్స్ లో ఉంచాడేమో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.