Bigg Boss AmarDeep Chowdary and Priyanka Jain Telangana Folk Song goes Viral
Amardeep Priyanka : ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 7 జరుగుతుంది. ఇప్పటికే అయిదు వారాలు అయిపోయి ఆరోవారం నడుస్తుంది. ఈ సారి కంటెస్టెంట్స్ లో సీరియల్స్ బ్యాచ్ ఎక్కువగా ఉన్నారు. అందులో అమర్ దీప్, ప్రియాంక జైన్ కూడా ఉన్నారు. అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ కూడా అనేక సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి జానకి కలగనలేదు అనే సీరియల్ లో కలిసి నటిస్తున్నారు.
ఇప్పుడు అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ కూడా బిగ్‌బాస్ లో ఉన్నారు. తమ గేమ్ తో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. బయట ఇన్ని రోజులు బాగానే కలిసి ఉన్నా హౌస్ లో మాత్రం అసలు బయట తాము క్లోజ్ అని మర్చిపోయి ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు. అయితే వీళ్ళు బిగ్‌బాస్ లో ఉండగానే వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
Also Read : Pooja Hegde : మాల్దీవ్స్‌లో బీచ్ పక్కన.. బికినీలో పూజా హెగ్డే బర్త్‌డే సెలబ్రేషన్స్..
నల్ల నల్ల మబ్బుల్లా.. అని సాగే ఈ పాటని వీరిద్దరూ బిగ్‌బాస్ కి వెళ్లేముందే షూటింగ్ చేశారు. తాజాగా ఈ పాటని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సీరియల్ లో ఇద్దరూ కలిసి నటించి మెప్పించారు. ఇప్పుడు పాటలో కూడా కలిసి డ్యాన్స్ వేసి అదరగొట్టారు అమర్ దీప్, ప్రియాంక జైన్. దీంతో వీరి అభిమానులు ఈ పాటని మరింత వైరల్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ పాటని బిగ్‌బాస్ లో వాళ్ళ ముందు ప్లే చేస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.