Pooja Hegde : మాల్దీవ్స్‌లో బీచ్ పక్కన.. బికినీలో పూజా హెగ్డే బర్త్‌డే సెలబ్రేషన్స్..
మాల్దీవ్స్ లో తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది పూజా హెగ్డే. మాల్దీవ్స్ కి వెళ్ళగానే అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

Pooja Hegde Enjoying Her Birthday Celebrations at Maldives
Pooja Hegde : తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజాహెగ్డే వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్ కి చెక్కేసింది. ఇటీవల టాలీవుడ్ లో చేతిలో ఉన్న ఆఫర్లని బాలీవుడ్ సినిమాల కోసం కూడా వదులుకొని పూజా బాగా వైరల్ అయింది. ప్రస్తుతం ఓ బాలీవుడ్(Bollywood) సినిమా చేస్తుంది పూజా హెగ్డే. నిన్న అక్టోబర్ 13 పూజాహెగ్డే పుట్టిన రోజు కావడంతో ముందుగానే తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్(Maldives) కి చెక్కేసింది బుట్టబొమ్మ.
మాల్దీవ్స్ లో తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది పూజా హెగ్డే. మాల్దీవ్స్ కి వెళ్ళగానే అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. సముద్రం ఒడ్డున నెట్ తో ఏర్పాటు చేసిన బెడ్ పై ప్రశాంతంగా పడుకున్న ఓ వీడియోని కూడా షేర్ చేసింది. ఇక నిన్న సాయంత్రం మాల్దీవ్స్ లో బీచ్ పక్కన బికినీలో కేక్ కట్ చేసింది. కేక్ ముందు పెట్టుకొని కూర్చున్న ఫోటోలని పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే నిన్న రాత్రి తాను నివసించే హోటల్ వాళ్ళు తన బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఆ వీడియోల్ని పూజా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
Also Read : Raviteja : తన బయోపిక్ పై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. టైటిల్ ఏంటో తెలుసా? ఎవరు యాక్ట్ చేస్తారు?
దీంతో పూజాహెగ్డే షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డేకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పలు ఫొటోలు షేర్ చేయగా పూజా హెగ్డే మాల్దీవ్స్ నుంచి ఇంకా ఎన్ని ఫోటోలు షేర్ చేస్తుందో చూడాలి.