Priyanka Jain : ‘జానకి కలగనలేదు’ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు నటి ప్రియాంక జైన్. ఆ తర్వా బిగ్ బాస్ 7 ఆమెకు మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది. కాగా ఇటీవల ప్రియాంక తల్లికి క్యాన్సర్ సోకిందని తెలియడం.. వెంటనే సర్జరీ చేయడం ఈ ఘటనలు ప్రియాంక ఫ్యామిలీని ఆందోళనలో నెట్టేశాయి. రీసెంట్‌గా ప్రియాంక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నారు.
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ కోసం సౌండ్ డిజైనర్స్ కావాలంటా.. ఇంటి దగ్గర నుంచే వర్క్..
ప్రియాంక జైన్.. ‘మౌనరాగం’ సీరియల్‌తో అందర్నీ ఆకట్టుకుని ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యారు. ఇక తెలుగు బిగ్ బాస్ 7 లో టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉన్న ప్రియాంకకి మరింత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఆనందంలో ఉన్న ప్రియాంక కుటుంబంలో ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడటం ఆందోళనకు గురి చేసింది. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉందని తెలియడం వెంటనే సర్జరీ చేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం ఆమె తల్లి కోలుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ప్రియాంక ఆమె ప్రియుడు శివకుమార్ తమ యూట్యూబ్ ఛానెల్ ‘నెవర్ ఎండింగ్ స్టోరీస్’ లో షేర్ చేసుకున్నారు.
ప్రియాంక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే తల్లికి పీరియడ్స్ టైమ్‌లో ఎక్కువగా బ్లీడింగ్ అవడం మొదలైందట. మెనోపాజ్ టైమ్‌లో ఇలా జరగడం సాధారణమే అని ఆమె లైట్ తీసుకున్నారట. ప్రియాంక హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా తల్లికి ఇదే పరిస్థితి కొనసాగడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేసిన అనంతరం క్యాన్సర్ మొదటి స్టేజ్‌లో ఉందని డాక్టర్లు చెప్పారట. వెంటనే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా యూట్రస్‌ను తొలగించారని ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు యూట్యూబ్ వీడియోలో ప్రియాంక వెల్లడించారు. మహిళల్లో ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే తమలాంటి తప్పు ఎవరూ చేయవద్దని వెంటనే అప్రమత్తమై డాక్టర్‌కి చూపించుకోమని ప్రియాంక వీడియోలో సూచించారు.
RAM : మొన్న హనుమాన్.. ఇప్పుడు ‘రామ్’.. ప్రతి సినిమా టికెట్ నుంచి 5 రూపాయలు..
బిగ్ బాస్ నుండి బయటకు రాగానే సైట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రియాంక కూడా కంటికి చిన్న సర్జరీ చేయించుకున్నారు. ఇక త్వరలో ప్రియాంక, శివకుమార్ పెళ్లి జరగబోతోందని అంతా అనుకున్నారు. ఈలోపు ప్రియాంక తల్లి అనారోగ్యం వారిని ఆందోళనలో పడేసింది. వీడియో చూసినవారంతా ప్రియాంకకు ధైర్యం చెబుతున్నారు. త్వరగా ఆమె తల్లి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.