Amardeep : బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా మరో కొత్త సినిమా ఓపెనింగ్..

అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి జంటగా కొత్త సినిమా ఓపెనింగ్ చేశారు.

Amardeep : బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా మరో కొత్త సినిమా ఓపెనింగ్..

Bigg Boss Fame Amardeep New Movie Opening

Updated On : April 21, 2025 / 7:51 PM IST

Amardeep : సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ పలు సినిమాల్లో కూడా హీరోగా నటిస్తున్నాడు. తాజాగా అమర్ దీప్ హీరోగా మరో కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. సన్నీలియోన్ మందిర సినిమా నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో MM నాయుడు దర్శకత్వంలో అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి జంటగా కొత్త సినిమా ఓపెనింగ్ చేశారు.

Also Read : Anand Sai – Pawan Kalyan : ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే.. 15 రోజులు కాల్ చేయలేదు.. కానీ యాక్సిడెంట్ అవ్వగానే..

ఈ సినిమాకు ‘సుమతీ శతకం’ అనే టైటిల్ ప్రకటించారు. విలేజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్‌లో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించగా ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో టేస్టీ తేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

Bigg Boss Fame Amardeep New Movie Opening