Ashu Reddy : వేణుస్వామి వద్ద మళ్ళీ పూజలు చేసిన అషురెడ్డి.. ఎవరి నమ్మకాలు వాళ్ళవి బ్రో అంటూ..

తాజాగా మరోసారి వేణుస్వామి వద్ద పూజలు చేసిన వీడియో అషురెడ్డి షేర్ చేసింది.

Bigg Boss Fame Ashu Reddy shares Devotional Pooja Video with Venu Swami

Ashu Reddy : ఇటీవల పలువురు సినీ ప్రముఖులు వేణుస్వామి(Venu Swamy) వద్ద పూజలు చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వేణుస్వామి కూడా పూజలు చేస్తూ, సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వైరల్ అవుతున్నారు. చాలామంది స్టార్ సెలబ్రిటీలు, హీరోయిన్స్ సైతం ఈయన వద్ద పూజలు చేయించుకుంటారు. కెరీర్ బాగుండాలని, ఆరోగ్యం కోసం, డబ్బు కోసం.. ఇలా పూజలు చేయిస్తారు. అయితే కొంతమంది ఈ పూజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటంతో దీనిపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తారు.

బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి అషురెడ్డి కూడా గతంలో వేణుస్వామితో రెండుసార్లు పూజలు చేయించిన వీడియోలు షేర్ చేసింది. ఓ సారి తాను కొత్త కార్ కొంటే దానికి వేణుస్వామి పూజ చేసిన వీడియో కూడా షేర్ చేసింది. అయితే పూజలు చేయించుకోవడం పర్సనల్ కానీ, వాటిని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏంటి అంటూ పలువురు కామెంట్స్ చేసారు. దీంతో కామెంట్స్ ఆఫ్ చేసి వీడియోలు షేర్ చేస్తుంది అషురెడ్డి.

Also Read : Yami Gautam : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందా?

తాజాగా మరోసారి వేణుస్వామి వద్ద పూజలు చేసిన వీడియో అషురెడ్డి షేర్ చేసింది. ఈ వీడియోకి కూడా కామెంట్స్ ఆఫ్ చేసింది. అయితే ఈ వీడియోకి మ్యాటర్ ఏం పెట్టలేదు కానీ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ ఎవరి నమ్మకాలు వాళ్ళవి బ్రో అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కామెంట్స్ ఆప్షన్ తీసేయడంతో కొంతమంది వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఆమె పాత వీడియోల కింద కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పూజలు అయినా ఫలించి అషురెడ్డికి అవకాశాలు ఏమైనా వస్తాయేమో చూడాలి.