Yami Gautam : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందా?

యామీ గౌతమ్-ఆదిత్య ధర్ జంట పేరెంట్స్ కాబోతున్నారు. . 'ఆర్టికల్ 370' మూవీ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని రివీల్ చేశారు.

Yami Gautam : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందా?

Yami Gautam

Updated On : February 9, 2024 / 7:49 PM IST

Yami Gautam : యామీ గౌతమ్-ఆదిత్య ధర్ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Rakul Preet Singh : ఈ నెలలోనే రకుల్ పెళ్లి? మోదీ చెప్పారని వెడ్డింగ్ ప్లేస్ మార్చుకున్నారా? అక్కడే ఎందుకు?

యామీ గౌతమ్ నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. అయితే తెలుగులో కంటే బాలీవుడ్‌లో పాపులారిటీ సంపాదించారు. యామీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమా టైమ్‌లో ఆదిత్య ధర్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ మూవీ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేశారు. వీరిద్దరూ 2021 లో పెళ్లి చేసుకున్నారు. కాగా రీసెంట్‌గా ఆదిత్య ధర్ తన రాబోయే చిత్రం ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో యామీ గౌతమ్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పంచుకున్నారు.

Kriti Sanon : పెళ్లెందుకు చేసుకోవట్లేదో కారణం చెప్పిన నటి.. అబ్బాయిలని అంత మాట అనేసిందేంటి?

ఈ కార్యక్రమంలో యామీ గౌతమ్ తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు.  ఓ వైపు సినిమా షూటింగ్.. మరోవైపు ప్రెగ్నెన్సీ.. ఆ సమయంలో తను ఎదుర్కున్న సవాళ్లను షేర్ చేసుకున్నారు. తన భర్త ప్రాజెక్టులో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉందని చెబుతూ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న భర్త ఆదిత్యధర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ‘ఆర్టికల్ 370’ కి వ్యతిరేకంగా వస్తున్న ఈ మూవీని ఆదిత్య సుహాస్ జంభలే డైరెక్ట్ చేసారు. యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు.