Kriti Sanon : పెళ్లెందుకు చేసుకోవట్లేదో కారణం చెప్పిన నటి.. అబ్బాయిలని అంత మాట అనేసిందేంటి?
కృతి సనన్ ఇంకా పెళ్లెందుకు చేసుకోవట్లేదు? అంటే రీసెంట్‌గా అందుకు కారణం చెప్పారు. ఆమె చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.

Kriti Sanon
Kriti Sanon : బాలీవుడ్‌లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్‌లో కృతి సనన్ ఒకరు. 33 ఏళ్లు వచ్చినా ఈ బ్యూటీకి ఇంకా పెళ్లి కాలేదు. అందుకు కారణమేంటో రీసెంట్‌గా కృతి సనన్ రివీల్ చేసారు. ఇక కృతి మాటలు విన్న అబ్బాయిలు ఎలా తట్టుకుంటారో ఏమో?
Teja Sajja : ‘ఈగల్’ డైరెక్టర్‌తో ‘హనుమాన్’ తేజ సజ్జ మూవీ?
కృతి సనన్ లేటెస్ట్ మూవీ ‘తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా’ ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న కృతి పెళ్లి విషయంపై మాట్లాడారు. అసలు పెళ్లెందుకు చేసుకోవట్లేని మీడియా అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చారు కృతి సనన్. ‘చుట్టూ ఉన్న అబ్బాయిలు మంచిగా లేరని.. మంచి అబ్బాయిలు ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉందని’ చెప్పారు. అంటే కృతికి మంచి అబ్బాయి దొరకలేదన్నమాట.
Naresh : ‘రంగస్థలం’లో ఆ పాట కోసం రోజంతా ఏడవాలి అన్నారట.. నరేశ్ పాట వింటూనే..
గతేడాది ప్రభాస్-కృతి డేటింగ్‌లో ఉన్నారని.. పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదంతా పుకార్లని తేలింది. ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఈ వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఆ తర్వాత ఇందులో నిజం లేదని తెలిసింది. కృతి సనన్ సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా పనిచేశారు. 2014 లో ‘1 : నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగ చైతన్యకి జోడిగా ‘దోచెయ్’ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.