Naresh : ‘రంగస్థలం’లో ఆ పాట కోసం రోజంతా ఏడవాలి అన్నారట.. నరేశ్ పాట వింటూనే..

'రంగస్థలం' సినిమాలో 'ఓరయ్యో.. నా అయ్యా' అనే పాట ఎప్పుడు వినిపించినా గుండె బరువెక్కుతుంది. ఈ పాట గురించి నటుడు నరేశ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Naresh : ‘రంగస్థలం’లో ఆ పాట కోసం రోజంతా ఏడవాలి అన్నారట.. నరేశ్ పాట వింటూనే..

Naresh

Updated On : February 9, 2024 / 5:35 PM IST

Naresh : చరణ-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ‘ఓరయ్యో.. నా అయ్యో’ అనే ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. దీనిని  గుర్తు చేసుకుంటూ నటుడు నరేశ్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Jaya Bachchan : జయాబచ్చన్ అమితాబ్‌ను అలా ఎప్పుడూ పిలవలేదట

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ డైరెక్షన్‌లో 2018లో వచ్చిన ‘రంగస్థలం’ అనూహ్యమైన విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతో కీలకం.. ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. అన్నదమ్ములుగా నటించిన చరణ్-ఆది పినిశెట్టిలకి నరేశ్, రోహిణీ తల్లిదండ్రులుగా నటించారు. అయితే ఆది పినిశెట్టి చనిపోయిన సందర్భంలో ‘ఓరయ్యో.. నా అయ్యా’ అంటూ పాట ఉంటుంది. ఈ పాట ఎప్పుడు చూసినా కన్నీరు వచ్చేస్తుంది. అయితే ఈ పాట షూట్‌కి ముందు సుకుమార్ నరేశ్‌కి ఈ పాట గురించి చెబుతూ రోజంతా ఏడవాలి.. అని చెప్పారట. దీనిపై నరేశ్ లేటెస్ట్‌గా మాట్లాడారు.

Shoaib Malik : హ‌నీమూన్‌లో ఎంజాయ్ చేసున్న షోయ‌బ్ మాలిక్‌..! పిక్‌ షేర్ చేసిన మూడో భార్య.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు!

నరేశ్‌కి ఆ పాట వింటూనే ఏడుపు వచ్చేసిందట. అసలు గ్లిజరిన్ అవసరం లేదని సుకుమార్‌కి చెప్పారట. అందుకు సుకుమార్ జోక్ చేస్తున్నారా? అని అడిగారట. కాదని చెప్పారట నరేశ్. తన సినిమాల్లో ప్రత్యేకంగా మేనరిజం అంటూ ఏది ఉండదని.. అలా తనకి ఇష్టం ఉండదని చెప్పారు నరేశ్. క్యారెక్టర్‌కి ఎంత అవసరమో అంతవరకు నటించాలని చెప్పారు. సినిమా సినిమాకి పాత్ర మారినట్లే పాత్రని బట్టి, దాని పరిధి వరకు నటించాలని అన్నారాయన. చరణ్ తండ్రిగా కోటేశ్వరరావు పాత్రలో ముఖ్యంగా ఈ పాటలో నరేశ్ జీవించారని చెప్పాలి. ఈ పాటని చంద్రబోస్ రాసి ఆయనే పాడారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం నరేశ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు.