Shoaib Malik : హ‌నీమూన్‌లో ఎంజాయ్ చేసున్న షోయ‌బ్ మాలిక్‌..! పిక్‌ షేర్ చేసిన మూడో భార్య.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు!

భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పాకిస్తాన్ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ విడాకులు తీసుకోవడం క్రికెట్ ప్ర‌పంచాన్ని షాక్‌కు గురి చేసింది.

Shoaib Malik : హ‌నీమూన్‌లో ఎంజాయ్ చేసున్న షోయ‌బ్ మాలిక్‌..! పిక్‌ షేర్ చేసిన మూడో భార్య.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు!

Shoaib Malik and Sana Javed share pics from honeymoon

Shoaib Malik-Sana Javed : భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పాకిస్తాన్ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ విడాకులు తీసుకోవడం క్రికెట్ ప్ర‌పంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ వెంట‌నే పాక్ న‌టి స‌నా జావేద్‌ను మూడో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను వారు ఇద్ద‌రు సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. పెళ్లైన వెంట‌నే బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ కోసం మాలిక్ బంగ్లాదేశ్‌కు వెళ్లాడు. కొన్ని కార‌ణాల చేత మూడు మ్యాచులు మాత్ర‌మే ఆడి తిరిగి పాకిస్తాన్‌కు చేరుకున్నాడు.

కాగా.. కొత్త జంట ప్ర‌స్తుతం హానీమూన్‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. న‌టి స‌నా జావేద్ గురువారం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పంచుకుంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న పసుపు తెలుపు రంగులు చార‌లు క‌లిగిన తువ్వాల‌తో వారి పాదాలు క‌ప్ప‌బ‌డి ఉంది. ఫోటోను బ‌ట్టి వారిద్ద‌రు విశ్రాంతి తీసుకుంటున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.

Ravindra Jadeja Father : కొడుక్కి పెళ్లి చేసి త‌ప్పు చేశా.. కోడ‌లి వ‌ల్లే మా కుటుంబంలో చీలిక‌లు.. జ‌డేజా తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఖ‌చ్చిత‌మైన లోకేష‌న్ తెలియ‌న‌ప్ప‌టికీ కూడా వారిద్ద‌రు హ‌నీమూన్‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కాగా.. దీనిపై నెటిజ‌న్లు మిశ్ర‌మంగా స్పందించారు. కొంద‌రు వారికి మ‌ద్ద‌తుగా కామెంట్లు చేస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం సానియా జీవితాన్ని స‌నా పాడుచేసింద‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. షోయ‌బ్ మాలిక్‌ను 2010లో సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. సానియాకు ఇది మొద‌టి వివాహం కాగా షోయ‌బ్‌కు ఇది రెండో పెళ్లి. త‌న మొద‌టి భార్య అయేషా సిద్ధిఖితో విడాకులు తీసుకున్న అనంత‌రం సానియాను రెండో పెళ్లి చేసుకున్నాడు షోయ‌బ్‌. వీరికి 2018లో ఓ కుమారుడు జ‌న్మించాడు. వీరి జంట విడిపోయిన‌ప్ప‌టి నుంచి ఇజాన్ త‌న త‌ల్లి సానియా వ‌ద్దే ఉంటున్నాడు. కాగా.. షోయ‌బ్‌తో విడిపోవ‌డం పై ఇప్ప‌టి వ‌ర‌కు సానియా మీర్జా ఎక్క‌డా స్పందించ‌లేదు.

Viral Video : వీడియో చూసి న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. ఈ అంపైర్ చాలా ఫ‌న్నీ గురూ