Viral Video : వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు.. ఈ అంపైర్ చాలా ఫన్నీ గురూ
క్రికెట్‌ను జెంటిల్ మేన్ గేమ్ అని అంటారు. ఈ గేమ్‌లో అప్పుడప్పుడూ కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

Right call wrong signal Umpire's hilarious reaction after on field gaffe
క్రికెట్‌ను జెంటిల్ మేన్ గేమ్ అని అంటారు. ఈ గేమ్‌లో అప్పుడప్పుడూ కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఘటననే చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకుని ఉండదు. థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔట్ అని ఇచ్చారు. అనంతరం తన తప్పును తెలుసుకుని నిర్ణయాన్ని సరిచేసుకున్నారు. దీంతో మైదానంతో పాటు క్రికెట్ ప్రేక్షకుల్లోనూ నవ్వులు విరిసాయి. ఈ ఘటన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో చోటు చేసుకుంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన జరిగింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 26వ ఓవర్‌ను ఆసీస్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ వేసింది. సఫారీ బ్యాటర్ సున్ లూస్ స్వీప్ షాట్ ఆడింది. అయితే.. బంతి బ్యాట్‌ను తాకలేదు. ప్యాడ్లను తాకింది. ఆసీస్ ప్లేయర్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. అయితే.. ఫీల్డ్ అంపైర్ క్లైర్ పొలోసాక్ నాటౌట్ ఇచ్చింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు రివ్యూకి వెళ్లారు.
పలు మార్లు రిప్లైలను పరిశీలించిన థర్డ్ అంపైర్ స్యూ రెడ్‌ఫెర్న్ బంతి వికెట్లను తాకదని గుర్తించి నాటౌట్‌ను ఇచ్చారు. అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటాలని చెప్పారు. అయితే.. ఫీల్డ్ అంపైర్ క్లైర్ పొలోసాక్ మాత్రం ఔట్ అని వేలు పైకి ఎత్తింది. వెంటనే తన తప్పును తెలుసుకుని నాటౌట్ ఇచ్చింది. దీన్ని చూసిన మైదానంలోని ఆసీస్ ప్లేయర్లతో పాటు ప్రేక్షకులు నవ్వుకున్నారు. కాగా.. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
When you get the call right … but the signal wrong! ??#AUSvSA pic.twitter.com/wfZPD1Z761
— cricket.com.au (@cricketcomau) February 7, 2024