Gautam Gambhir : అంద‌రి ముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పా.. గంభీర్‌

ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌కు ఆట‌గాళ్లు అంద‌రి ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ చెప్పాడు.

Gautam Gambhir : అంద‌రి ముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పా.. గంభీర్‌

Gambhir Apologising To McCullum

Gambhir Apologising To McCullum : ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌కు ఆట‌గాళ్లు అంద‌రి ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ చెప్పాడు. అయితే అది ఇప్పుడు కాద‌ని 2012లో జ‌రిగింద‌న్నాడు. ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) త‌రుపున తామిద్ద‌రం క‌లిసి ఆడిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నాడు.

క్ష‌మాప‌ణ‌లు ఎందుకంటే..?

‘2012 సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు కోల్‌క‌తా స్టార్ పేస‌ర్ ల‌క్ష్మీప‌తి బాలాజీ గాయప‌డ్డాడు. దీంతో అత‌డి స్థానంలో ఓవ‌ర్‌సీన్ ఆట‌గాడు అయిన బ్రెట్‌లీని తీసుకోవాల‌ని అనుకున్నాం. అయితే.. జ‌ట్టులో న‌లుగురు విదేశీ ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే చోటు ఉండ‌డంతో కాంబినేష‌న్‌లో భాగంగా బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ పై వేటు వేయాల్సి వ‌చ్చింది.

Virat Kohli : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ పాట‌కు కోహ్లీ, అనుష్క‌ డ్యాన్స్ చూశారా? కానీ..

ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు చెన్నై వెళ్లే ముందు జ‌ట్టు స‌మావేశాన్ని ఏర్పాటు చేశాం.ఆ స‌మ‌యంలో ఆట‌గాళ్ల అంద‌రి ముందు బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పా. ఫైన‌ల్ మ్యాచ్‌కు అత‌డు ఆడ‌డం లేద‌ని, టీమ్‌కాంబినేష‌న్‌లో భాగంగా బ్రెట్‌లీ ని తీసుకుంటున్న‌ట్లు వివ‌రించాను. ‘అని గంభీర్ చెప్పాడు.

 

View this post on Instagram

 

A post shared by Gautam Gambhir (@gautamgambhir55)

ఇలా ఎవ‌రూ చేయ‌ర‌న్నాడు. అయితే.. ఇలా చేయ‌క‌పోతే ఏదో త‌ప్పు చేశాన‌నే అప‌రాధ భావం న‌న్ను వెంటాడుతుండేది. ఓ కెప్టెన్‌గా ప్ర‌శంస‌లు పొంద‌డం, క్రెడిట్ తీసుకోవ‌డం మాత్ర‌మే కాద‌ని, ఆట‌గాళ్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పే ధైర్యం సైతం ఉండాలన్నారు. కొన్నిసార్లు ఇది చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్నారు. అయితే.. ఓ నాయ‌కుడిగా ఎద‌గాలంటే మాత్రం ఇవ‌న్నీ చేయాల్సిందేన‌ని అని గంభీర్ అన్నాడు.

కాగా.. గంభీర్ 2011 నుంచి 2017 వ‌ర‌కు కేకేఆర్ త‌రుపున ఆడాడు. అత‌డి సార‌థ్యంలో 2012, 2014 సీజ‌న్‌ల‌లో కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2018లో అత‌డు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే.. ఆశించిన మేర రాణించ‌క‌పోవ‌డంతో సీజ‌న్ మ‌ధ్య‌లో ఆట‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. అనంత‌రం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు మెంటార్‌గా కొన‌సాగాడు. ఐపీఎల్ 2024 మినీ వేలం ముందు ల‌క్నోను వ‌దిలి మ‌ళ్లీ కేకేఆర్ జ‌ట్టులో చేరాడు.

Ishan Kishan : ఇషాన్ కిష‌న్ అల‌క‌కు అత‌డే కార‌ణ‌మా? అందుక‌నే ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చాడా?