Virat Kohli : టాలీవుడ్ సూపర్ స్టార్ పాటకు కోహ్లీ, అనుష్క డ్యాన్స్ చూశారా? కానీ..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి స్టెప్పులు వేశాడు.
![Virat Kohli : టాలీవుడ్ సూపర్ స్టార్ పాటకు కోహ్లీ, అనుష్క డ్యాన్స్ చూశారా? కానీ.. Virat Kohli : టాలీవుడ్ సూపర్ స్టార్ పాటకు కోహ్లీ, అనుష్క డ్యాన్స్ చూశారా? కానీ..](https://10tv.in/wp-content/uploads/2024/02/New-Project-10-5.jpg)
Kohli Anushka couple dance video edited to Kurchi Madathapetti Song
Virat Kohli – Anushka Sharma : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అన్న సంగతిని కాస్త పక్కన బెడితే మాత్రం ఈ చిత్రంలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులతో దుమ్ములేపారు. ఈ పాటకు చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ రీల్స్ చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ పాట రీల్స్ దర్శనమిస్తున్నాయి.
కాగా.. తాజాగా ఈ పాటకు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. వాస్తవానికి వారు ఈ పాటకు డ్యాన్స్ చేయలేదు. గతంలో విరుష్క జంట ఏదో పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను ఎడిట్ చేసి కుర్చీ మడత పెట్టి సాంగ్‌ను జోడించారు. అయినప్పటికీ కూడా ఇది భలేగా సింక్ అయింది.
Also Read: ఇషాన్ కిషన్ అలకకు అతడే కారణమా? అందుకనే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చాడా?
View this post on Instagram
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరం!
వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. మూడో టెస్టు మ్యాచ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడు అని భావించినప్పటికీ అది జరిగేలా కనిపించడం లేదు. మరో రెండు టెస్టు మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు. కనీసం సిరీస్‌లోని ఆఖరి టెస్టు మ్యాచ్ అయినా ఆడతాడా అంటూ అదీ అనుమానమేనని సమాచారం. కాగా.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. రెండో బిడ్డకు జన్మనివ్వడానికి అనుష్కసిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
Also Read: ధోని బ్యాట్ పైనే అందరి కళ్లూ.. కోట్లు వద్దుకుని, స్నేహితుడి కోసం..