Teja Sajja : ‘ఈగల్’ డైరెక్టర్‌తో ‘హనుమాన్’ తేజ సజ్జ మూవీ?
తేజ సజ్జ నెక్స్ట్ సినిమాలు ఏంటి? ఎలాంటి సినిమాలతో రాబోతున్నాడు అని చర్చలు నడుస్తున్నాయి.

Hanuman Teja Sajja Next Movie with Eagle Director Karthik Ghattamaneni
Teja Sajja Next Movie : ‘హనుమాన్'(Hanuman) సినిమాతో తేజ సజ్జ పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. చిన్నప్పట్నుంచి సినిమాల్లో నటిస్తూ మనల్ని మెప్పించిన తేజ హీరోగా మారి వరుసగా కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతికి ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో హనుమాన్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టాడు. దీంతో తేజ సజ్జ నెక్స్ట్ సినిమాలు ఏంటి? ఎలాంటి సినిమాలతో రాబోతున్నాడు అని చర్చలు నడుస్తున్నాయి.
తేజ సజ్జ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో కూడా అందబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తేజ సజ్జ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా మరో కొత్త కాంబో టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) తాజాగా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్ చూశారా? జుట్టు, గడ్డం బాగా పెంచేసి.. రాజమౌళి సినిమా కోసమేనా?
కెమెరామెన్ గా, దర్శకుడిగా సక్సెస్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఓ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కబోతుంది తెలుస్తుంది. ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుడు – హీరో – నిర్మాత కలిసి సినిమా తీస్తే అది ఏ రేంజ్ లో రాబోతుందో చూడాలి మరి.