Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్ చూశారా? జుట్టు, గడ్డం బాగా పెంచేసి.. రాజమౌళి సినిమా కోసమేనా?

త్వరలోనే రాజమౌళి - మహేష్ సినిమా సినిమాని మొదలుపెడతారని వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ కొత్త లుక్ బయటకి వచ్చింది.

Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్ చూశారా? జుట్టు, గడ్డం బాగా పెంచేసి.. రాజమౌళి సినిమా కోసమేనా?

Mahesh Babu new Look with Beard and Heavy Hair Photo goes viral Fans asking is this look for Rajamouli Movie

Updated On : February 9, 2024 / 6:14 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో వచ్చి ప్రేక్షకులని అలరించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీని తర్వాత మహేష్ రాజమౌళితోనే సినిమా చేయనున్నారు. రాజమౌళి – మహేష్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి(Rajamouli) చెప్పారు.

మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కొన్ని రోజుల క్రితమే మహేష్ కూడా జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకొని వచ్చారు. త్వరలోనే ఈ సినిమాని మొదలుపెడతారని వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ కొత్త లుక్ బయటకి వచ్చింది.

Also Read : Naresh : ‘రంగస్థలం’లో ఆ పాట కోసం రోజంతా ఏడవాలి అన్నారట.. నరేశ్ పాట వింటూనే..

దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ పెళ్ళికి పిలవడానికి మహేష్ ఇంటికి వెళ్లారు. మహేష్ ఫ్యామిలీకి కార్డు ఇచ్చి పెళ్ళికి పిలిచారు. ఈ సందర్భంగా మహేష్, నమ్రతలతో దిగిన ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మహేష్ బాగా జుట్టు పెంచి, గడ్డం కూడా బాగా పెంచినట్టు కనిపిస్తుంది. హెయిర్ ఎక్కువగా ఉంది కనపడకుండా ఉండటానికి టోపీ పెట్టినట్టు తెలుస్తుంది. మహేష్ ఎక్కువ హెయిర్, గడ్డంతో చాలా తక్కువ కనిపిస్తాడు. ఇప్పుడు ఈ ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతూనే, ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌళి మహేష్ బాబుని ఎలా చూపిస్తాడో చూడాలి.

Mahesh Babu new Look with Beard and Heavy Hair Photo goes viral Fans asking is this look for Rajamouli Movie