Mahesh Babu new Look with Beard and Heavy Hair Photo goes viral Fans asking is this look for Rajamouli Movie
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో వచ్చి ప్రేక్షకులని అలరించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీని తర్వాత మహేష్ రాజమౌళితోనే సినిమా చేయనున్నారు. రాజమౌళి – మహేష్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి(Rajamouli) చెప్పారు.
మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కొన్ని రోజుల క్రితమే మహేష్ కూడా జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకొని వచ్చారు. త్వరలోనే ఈ సినిమాని మొదలుపెడతారని వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ కొత్త లుక్ బయటకి వచ్చింది.
Also Read : Naresh : ‘రంగస్థలం’లో ఆ పాట కోసం రోజంతా ఏడవాలి అన్నారట.. నరేశ్ పాట వింటూనే..
దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ పెళ్ళికి పిలవడానికి మహేష్ ఇంటికి వెళ్లారు. మహేష్ ఫ్యామిలీకి కార్డు ఇచ్చి పెళ్ళికి పిలిచారు. ఈ సందర్భంగా మహేష్, నమ్రతలతో దిగిన ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మహేష్ బాగా జుట్టు పెంచి, గడ్డం కూడా బాగా పెంచినట్టు కనిపిస్తుంది. హెయిర్ ఎక్కువగా ఉంది కనపడకుండా ఉండటానికి టోపీ పెట్టినట్టు తెలుస్తుంది. మహేష్ ఎక్కువ హెయిర్, గడ్డంతో చాలా తక్కువ కనిపిస్తాడు. ఇప్పుడు ఈ ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతూనే, ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌళి మహేష్ బాబుని ఎలా చూపిస్తాడో చూడాలి.