Rakul Preet Singh : ఈ నెలలోనే రకుల్ పెళ్లి? మోదీ చెప్పారని వెడ్డింగ్ ప్లేస్ మార్చుకున్నారా? అక్కడే ఎందుకు?

పెళ్ళికి తొందరెందుకు, ప్రేమ ఎంజాయ్ చేస్తున్నాము అంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన రకుల్ - జాకీ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

Rakul Preet Singh : ఈ నెలలోనే రకుల్ పెళ్లి? మోదీ చెప్పారని వెడ్డింగ్ ప్లేస్ మార్చుకున్నారా? అక్కడే ఎందుకు?

Rakul Preet Singh Jackky Bhagnani Wedding Date and Venue full Details Here

Updated On : February 9, 2024 / 7:10 PM IST

Rakul Preet Singh Wedding : తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. పనిలో పనిగా అక్కడే ప్రేమలో కూడా పడింది రకుల్. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో(Jackky Bhagnani) ప్రేమలో పడినట్టు రకుల్ 2021 లోనే ప్రకటించింది. అప్పట్నుంచి వీరిద్దరూ ప్రేమలోనే ఉన్నారు.

పెళ్ళికి తొందరెందుకు, ప్రేమ ఎంజాయ్ చేస్తున్నాము అంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన రకుల్ – జాకీ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా రకుల్ పెళ్లి ఈ నెలలోనే జరగబోతుందని, వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా ఫిక్స్ చేసారని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ సమాచారం ప్రకారం రకుల్ – జాకీ భగ్నానీ పెళ్లి ఫిబ్రవరి 22న జరగబోతున్నట్టు తెలుస్తుంది. గోవాలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. కేవలం ఫ్యామిలీ, పలువురు సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుకలు జరిపి అనంతరం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసి బాలీవుడ్ అందర్నీ పిలుస్తారని సమాచారం. అయితే పెళ్లిపై అధికారికంగా రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ.. ఇంకా స్పందించలేదు.

Also Read : Kriti Sanon : పెళ్లెందుకు చేసుకోవట్లేదో కారణం చెప్పిన నటి.. అబ్బాయిలని అంత మాట అనేసిందేంటి?

తాజాగా ఓ ఆసక్తికర విషయం కూడా వినిపిస్తుంది. రకుల్ – జాకీ భగ్నానీ మొదట తమ పెళ్లిని దుబాయ్ కానీ, మాల్దీవ్స్ లో కానీ చేసుకోవాలనుకున్నారట. కానీ ఇటీవల మాల్దీవ్స్ ఇష్యూ, మన మోదీ ఇండియా టూరిజం అభివృద్ధి గురించి మాట్లాడటం చూసాక ఈ జంట మనసు మార్చుకున్నారట. అంతేకాకుండా రకుల్ – జాకీ భగ్నానీల ప్రేమ గోవాలోని మొదలైందని, ఆ తర్వాత వీళ్ళు చాలాసార్లు గోవా వచ్చి ఎంజాయ్ చేసారని, అందుకే పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎప్పుడు ఒక్కటవుతుందో చూడాలి.