Keerthi Bhat
Keerthi Bhat : సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి కీర్తి భట్. బిగ్‌బాస్ సీజన్ 6 షోలో కూడా పాల్గొని పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తనకు ఫ్యామిలీ ఎవరూ లేరని, అందరూ చనిపోయారని చెప్పి ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తను ప్రేమించిన వ్యక్తి నటుడు, డ్యాన్సర్ విజయ్ కార్తీక్ ని నిశ్చితార్థం చేసుకుంది.(Keerthi Bhat)
విజయ్ కార్తీక్ – కీర్తి భట్ జంట కలిసి పలు టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసారు. కీర్తికి ఎవరూ లేకపోవడంతో కార్తీక్ తోనే లివ్ ఇన్ రిలేషన్ తో పెళ్ళికి ముందే కలిసి ఉండేది. గత కొన్నాళ్ల నుంచే వీరు విడిపోయారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా రెండేళ్ల నిశ్చితార్థం, లివ్ ఇన్ రిలేషన్ తర్వాత కీర్తి భట్ తన ప్రియుడితో విడిపోయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read : Anchor Jhansi : చిరంజీవికి యాంకర్ ఝాన్సీ కౌంటర్ ఇచ్చిందా? వరుస పోస్టులు వైరల్..
కీర్తి భట్ తన సోషల్ మీడియాలో.. నేను నిజాయితీగా, స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో ఇటీవలి బంధం ముగిసింది. అది చాలా కాలం సాగింది, అది నిజమైన బంధం. కానీ అది జీవిత భాగస్వామి, భర్త అనే బంధంగా పెరగలేదు. పరస్పర గౌరవంతో, దానిని స్నేహంగా అంగీకరించి ముందుకు సాగాలని అనుకున్నాను. ఈ నిర్ణయం వల్ల బాధపడే ఎవరికైనా నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను. వీటిపై రూమర్స్ ప్రమోట్ చేస్తూ నన్ను బాధపెడుతున్నారు. ఇప్పుడు నాకు జీవితం యుద్ధ సమయం లాంటిది. నేను బలంగా నిలబడ్డాను. నేను రాజీ పడి జీవితాన్ని గడపడం కంటే ఆనందాన్ని ఎంచుకున్నాను. నాకు సపోర్ట్ చేసేవాళ్లు నాతో ఉంటారు అని ఆశిస్తున్నాను అని పోస్ట్ చేసింది.
Also Read : Indravathi Chauhan : మంగ్లీ సిస్టర్ ని చూశారా..? ఊ అంటావా ఊ ఊ అంటావా సింగర్ ఇంద్రావతి మోడ్రన్ లుక్స్..