Bigg Boss : మళ్ళీ రెండు నెలల్లోనే బిగ్‌బాస్ సీజన్ 6

నిన్న విన్నర్‌, రన్నర్‌ ప్రకటించిన తర్వాత స్టేజి మీదే తర్వాత సీజన్‌ ఎప్పుడో ప్రకటించాడు నాగ్‌. నాగార్జున బిగ్ బాస్ స్టేజిపై మాట్లాడుతూ.. ''సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే........

Bigg Boss : మళ్ళీ రెండు నెలల్లోనే బిగ్‌బాస్ సీజన్ 6

Bigg Boss

Bigg Boss :   నిన్నటితో బిగ్ బాస్ సీజన్ 5 అయిపోయింది. దాదాపు 15 వారాల పాటు సాగిన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, అప్పటి వరకు కొంతమందికే తెలిసిన కంటెస్టెంట్స్ ని మరింత సెలబ్రిటీలు చేసి పంపించింది. ఈ సీజన్ లో సన్నీ విన్నర్ గా నిలవగా, షన్ను రన్నరప్ గా నిలిచాడు. ఈ సీజన్ అయిపోగానే చాలా మంది నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తున్నారు.

అయితే ఒక సీజన్ కి ఇంకో సీజన్ కి కనీసం 9 నెలల పైగానే గ్యాప్ ఉంటుంది. ఈ సారి కూడా అంతే అనుకున్నారు. కానీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు ఉంటుందో చెప్పి నాగార్జున షాక్ ఇచ్చారు ప్రేక్షకులకి. నిన్న విన్నర్‌, రన్నర్‌ ప్రకటించిన తర్వాత స్టేజి మీదే తర్వాత సీజన్‌ ఎప్పుడో ప్రకటించాడు నాగ్‌. నాగార్జున బిగ్ బాస్ స్టేజిపై మాట్లాడుతూ.. ”సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవ్వడానికి, దానికి సంబంధించిన వర్క్ ని స్టార్ట్ చేయడానికి 6 నెలల పైనే పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్‌ 6 సీజన్‌ను అంతకు ముందే మీ ముందుకు తీసుకురాబోతున్నాము. రెండు నెలల్లోనే బిగ్ బాస్ 6వ సీజన్ ని మొదలు పెట్టబోతున్నాము” అని తెలిపారు.

Hamsanandini : బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తో హంసానందిని.. ఇప్పటికే తొమ్మిది సార్లు కీమోథెరపీ

ఈ లెక్కన ఫిబ్రవరిలో వర్క్ మొదలు పెట్టినా మార్చ్ లేదా ఏప్రిల్ లోనే బిగ్ బాస్ 6వ సీజన్ టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే సీజన్ మరింత ముందే వస్తుండటంతో బిగ్ బాస్ అభిమానులు ఆనందిస్తున్నారు. అయితే నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ అని అర్థమైపోయింది. మరి వచ్చే సీజన్ లో కంటెస్టెంట్స్ ని ఎవర్ని తీసుకొస్తారో చూడాలి.