Hamsa Nandini : బ్రెస్ట్ క్యాన్సర్తో హంసానందిని.. ఇప్పటికే తొమ్మిది సార్లు కీమోథెరపీ
తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం తెలిపింది. నాలుగు నెలల క్రితం తనకు కొంచెం అనారోగ్యంగా అన్పించి పరీక్షలు చేయించుకోగా అందులో తనకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్....
Hamsa Nandini: తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్పెషల్ సాంగ్స్ చేస్తూ సెటిల్ అయిపొయింది హంసానందింది. ఇటీవల సోషల్ మీడియాకి దాదాపు నాలుగు నెలలుగా దూరంగా ఉంది హంసానందిని. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఆమెకి ఏమైంది అని కంగారుపడ్డారు. తాజాగా ఇవాళ మళ్ళీ హంసానందిని సోషల్ మీడియాలోకి వచ్చింది. తానూ ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదో తెలిపింది.
ఇవాళ ఉదయం హంసానందిని తన సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ ని పెట్టింది. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం తెలిపింది. నాలుగు నెలల క్రితం తనకు కొంచెం అనారోగ్యంగా అన్పించి పరీక్షలు చేయించుకోగా అందులో తనకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలిపింది. అప్పటి నుంచి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. బ్రెస్ట్ లో ఉన్న క్యాన్సర్ కు సంబంధించి ట్యూమర్ ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారన్నారు. అయితే ఈ ఆనందం తనకు ఎక్కువ సేపు లేదని, మా మదర్ కూడా క్యాన్సర్ తోనే చనిపోయిందని, తనకు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదం ఉందని, ఈ మేరకు జెనెటిక్ మ్యూటేషన్ ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారని తెలిపారు.
RRR “అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్
మరోసారి బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి కూడా 70 శాతం ఛాన్స్ ఉందని డాక్టర్లు తెలిపారని వెల్లడించింది హంసానందిని. ఇప్పటికే తొమ్మిదిసార్లు కీమోథెరపి చికిత్స తీసుకున్నానని, ఇంకో ఏడు సార్లు చేయించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ వ్యాధికి తన జీవితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఇవ్వనని, తాను త్వరగా కోలుకొని మళ్ళీ తెరపైన కచ్చితంగా కనిపిస్తానని తెలిపింది.
Rakul Preet Singh : రకుల్ ఎనర్జీకి అవే కారణం అంట..
ఈ సమస్య నుంచి కోలుకొని ఇతరులను కూడా ఎడ్యుకేట్ చేసి ఈ వ్యాధితో బాధపడే వాళ్ళలో స్ఫూర్తి నింపుతాను అని అన్నారు. ఇన్ని రోజులు నేను కనపడకపోయేసరికి నా ఇన్ బాక్స్ మొత్తం మెసేజ్ లతో నిండిపోయింది. నా గురించి మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు అని తెలిపింది. ఇలా తన ఇంస్టాగ్రామ్ లో నాలుగు నెలల తర్వాత పోస్ట్ పెట్టేసరికి, తనకి క్యాన్సర్ అని తెలియగానే తాను త్వరగా కోరుకోవాలని కోరుతూ అభిమానులు , ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా పోస్టులు చేస్తున్నారు.
View this post on Instagram