Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 గ్రాండ్ లాంచ్ ప్రొమో.. అదిరిపోయిన బిగ్‌బాస్ హౌస్‌..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 (Bigg Boss Telugu 9 ) గ్రాండ్ లాంచ్ ప్రొమో వ‌చ్చేసింది.

Bigg Boss Season 9 Grand Launch promo out now

Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. విజ‌య‌వంతంగా 8 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆదివారం సెప్టెంబ‌ర్ 7) నుంచి తొమ్మిదో సీజ‌న్ (Bigg Boss Telugu 9) ప్రారంభం కానుంది. గ్రాంచ్ లాంచ్ ఈవెంట్‌కు మ‌రికొన్ని గంట‌లే ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. 2 నిమిషాల 29 సెక‌న్లు ఉన్న ఈ ప్రొమో అదిరిపోయింది.

ఊహకందని మార్పులు, ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్‌తో.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9 అని నాగార్జున వాయిస్‌తో ప్రొమో ప్రారంభ‌మైంది. నాగ్ లుక్ అదిరిపోయింది. ఇక బిగ్‌బాస్ హౌస్ ఓ రేంజ్‌లో ఉంది. ఇక ఎప్పటిలాగే ఈ ప్రోమోలో కంటెస్టెంట్ల ఫేస్‌ను రివీల్ చేయకుండా చూపించారు.

OG BGM : ప‌వ‌న్ ‘ఓజీ’ కోసం జపనీస్‌ వాద్య పరికరం.. తమన్ క్రియేట్‌ చేసిన బీజీఎం ఇదేనా!

ఒకత‌ను చిన్న బాక్స్ లాంటిది పట్టుకుని వ‌చ్చాడు. త‌న బాడీలో ఇది సగం అని చెప్పాడు. ఈ బాక్స్‌తో లోప‌లికి వెళ‌తాను అని బిగ్‌బాస్ ప‌ర్మిష‌న్ కోరాడు. అయితే అందుకు బిగ్‌బాస్ నిరాక‌రించాడు. దీంతో స‌ద‌రు కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వెళ‌తాన‌ని అంటాడు. ఇందుకు అది మీ ఇష్టం అంటూ బిగ్‌బాస్ అంటాడు. దీంతో అత‌డు బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకుండానే బ‌య‌ట‌కు వెళ్లిపోతాడు.