Shobha Shetty : పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి.. బిగ్‌బాస్ శోభాశెట్టి ఏం ప్లాన్ చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ లో తన ప్రియుడు యశ్వంత్(Yashwanth) రావడంతో తమ ప్రేమ గురించి అందరికి చెప్పింది శోభాశెట్టి .

Bigg Boss Shobha Shetty Shares a Video with her Lover Yashwanth

Shobha Shetty : కార్తీకదీపం సీరియల్ తో విలన్ గా మోనిత పాత్రలో బాగా పాపులర్ అయిన శోభాశెట్టి ఇటీవల బిగ్ బాస్(Bigg Boss) తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ లో లేడీ టైగర్ గా రెచ్చిపోయింది. కానీ ఫైనల్ వరకు రాకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఈ భామ. ఇక బిగ్ బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ లో తన ప్రియుడు యశ్వంత్(Yashwanth) రావడంతో తమ ప్రేమ గురించి అందరికి చెప్పింది.

త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారు అని సమాచారం. పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి ఉండటానికి ఓ ఫ్లాట్ ని కొనుక్కొని దాన్ని వీరికి నచ్చినట్టు డిజైన్ చేయించుకుంటున్నారు. దీనికి ఇద్దరి పేర్లు కలిసేలా యశ్‌శోభా నిలయం అని పేరు పెట్టడం విశేషం. తాజాగా ఈ ఫ్లాట్ కి సంబంధించి ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శోభాశెట్టి తల్లితండ్రులు, ప్రియుడు యశ్వంత్ కూడా ఉన్నాడు.

Also Read : Sivaji : బిగ్‌బాస్ తర్వాత బోయపాటితో శివాజీ స్పెషల్ మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?

దీంతో ప్రస్తుతం శోభాశెట్టి యశోభ నిలయం వీడియో వైరల్ గా మారింది. ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శోభా శెట్టి కాబోయే భర్త యశ్వంత్ కూడా నటుడే. పలు సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్నాడు. మరి శోభాశెట్టి కొత్త ఫ్లాట్ వీడియో మీరు కూడా చూసేయండి.