Bigg Boss Telugu 7 Day 44 Promo
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఏడో వారం ప్రారంభమైంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రోజు ఏడుగురు నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇక మిగిలిన వారు నేడు నామినేషన్ల ప్రక్రియలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది. తేజ నువ్వు పనిష్మెంట్‌ని చాలా సిల్లీగా తీసుకుంటున్నావ్.. ఈ రోజు కూడా వెళ్తా.. వీఐపీ రూమ్‌లో పడుకుంటా అని అనడం నాకు నచ్చడం లేదంటూ తేజాను శోభాశెట్టి నామినేట్ చేసింది.
నేను ఫన్ కోసం అలా అన్నాను అంటూ తేజా అనగా నీకు ప్రతిదీ ఫన్ బ్రో.. మాకు మాత్రం సీరియస్ బ్రో అంటూ మోనిత రెచ్చిపోయింది. ఆతరువాత భోలె షావలిని శోభాశెట్టి నామినేట్ చేసింది. మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది. ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్ ఉంది అని భోలె అన్నాడు. దీంతో ప్రియాంక జైన్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆడపిల్ల ఆడపిల్ల అంటూ నటించావు కదా.. ఇంతసేపు కనిపిస్తోంది అంటూ అతడి పై మండిపడింది.
Sivakarthikeyan : శివకార్తికేయన్ మోసం చేశాడు.. తనతో మళ్ళీ పని చేయను.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..
నీలాంటి వాళ్లని చాలా మందిని చూశా పో అని భోలె అన్నాడు. ఈ మాటలు వినలేకపోతున్నాను బిగ్ బాస్ అంటూ ప్రియంక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆడిపిల్ల పక్కన ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకో అంటూ శోభా శెట్టి అతడికి వార్నింగ్ ఇచ్చింది. భోలె షావలిని తూ అని ప్రియాంక అంది. అదే నేను తిరిగి అంటే నీ బతుకు ఏం కావాలి అంటూ భోలె అన్నాడు.
ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం తేజ మాట్లాడుతూ.. అందరూ నామినేషన్ చేయడం ఒక ఎత్తు నువ్వు చేయడం ఒక ఎత్తు అని శోభాశెట్టిని ఉద్దేశించి అన్నాడు.