Nuvve Kavali: క్లాసిక్ హిట్ ‘నువ్వే కావాలి’ సినిమాకి 25 ఏళ్ళు.. అప్పట్లోనే బాహుబలి రేంజ్ హిట్..
నువ్వే కావాలి.. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు చాలా మందికి(Nuvve Kavali) ఒక ఎమోషన్ కూడా. ఎందుకంటే, ఈ సినిమా సాధించిన విజయం ఆషామాషీ కాదు. నిర్మాతకు, దర్శకుడికి, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, రచయిత ఇలా ప్రతీ ఒక్కళ్లకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టిన సినిమా ఇది.

25 Years of Nuvve Kavali Movie Special Story
Nuvve Kavali: నువ్వే కావాలి.. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు చాలా మందికి ఒక ఎమోషన్ కూడా. ఎందుకంటే, ఈ సినిమా సాధించిన విజయం ఆషామాషీ కాదు. నిర్మాతకు, దర్శకుడికి, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, రచయిత ఇలా ప్రతీ ఒక్కళ్లకు (Nuvve Kavali)ఎనలేని గౌరవం తెచ్చిపెట్టిన సినిమా ఇది. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఒక సంచలనమే క్రియేట్ చేసింది. కె విజయభాస్కర్, త్రివిక్రమ్, తరుణ్, రిచా, కోటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2000 అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఈ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్ళు గడుస్తున్న సందర్బంగా నువ్వే కావాలి సినిమా గురించి చాలా మందికి తెలియని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
* హీరోగా తరుణ్ కి ఇది మొదటి సినిమా. బాలనటుడిగా అప్పటికే 30 సినిమాలు చేశాడు తరుణ్. హీరోయిన్ గా రిచా పళ్ళోడ్ ను తీసుకున్నారు. నిజానికి నువ్వే కావాలి సినిమా రీమేక్. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘నిరం’ సినిమాను మన తెలుగు నేటివిటిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి చేశారు. ఒరిజినల్ కంటే తెలుగులోనే భారీ సక్సెస్ సాధించింది ఈ సినిమా.
* 2000 అక్టోబర్ 13న నువ్వే కావాలి సినిమా విడుదల అయ్యింది. మొదటిషో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. 20 సెంటర్స్ లో 200 రోజులు ప్రదర్శితమైన ఈ సినిమా ఆరు సెంటర్స్ లో ఏకంగా 365 రోజులు ఆడింది. కొన్ని సెంటర్స్ లో 400 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
* కేవలం రూ.1.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు 3 కోట్లకు పైగా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి వీక్షించారు. ఆ సమయంలో ఇది ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. దాదాపు రూ.24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. సరిగ్గా చెప్పాలంటే ఆ సమయంలో ఇది బాహుబలి కన్నా పెద్ద హిట్ అన్నమాట.
* ఇక్కడ మరో విశేషం ఏంటంటే, నువ్వే కావాలి సినిమాకి ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా అనుకున్నారు. కాకపోతే మహేష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సుమంత్ ను కూడా అనుకున్నారు కానీ, సుమంత్ ఆ సమయంలో బిజీగా ఉండటంతో బాలీవుడ్ హీరోతో చేద్దాం ట్రై చేశారు. కానీ, ఫైనల్ గా తరుణ్ వద్దకు వెళ్ళింది ఈ సినిమా.
* ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాను తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఓపక్క యూత్, మరోపక్క ఎమోషనల్ మ్యూజిక్ అందించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. అనగనగా ఆకాశం ఉంది, ఎక్కడ ఉన్న పక్కన నువ్వే, కళ్ళలోకి కళ్ళుపెట్టి చూడవెందుకు అనే సాంగ్స్ ఇప్పటికే చాట్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
* ఇక త్రివిక్రమ్ తన మాటలతో మంత్రమే వేశాడు. సన్నివేశానికి తగ్గ పదునైన, భావోద్వేగమైన సంభాషణలు అందించి తన కలం బలాన్ని రుచి చూపించాడు. మఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశంలో వచ్చే సంభాషణలు ఆడియన్స్ హ్రదయాలను తాకుతాయి. అక్కడ మొదలైన త్రివిక్రమ్ మాటల ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.
* ఇదే సినిమాను హిందీలో ‘తుఝే మేరీ కసమ్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో రితేష్, జెనీలియా జంటగా నటించారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
* కేవలం కాసులు మాత్రమే కాదు అవార్డుల వర్షం కూడా కురిపించింది ఈ సినిమా. 2000 సంవత్సరానికి గాను ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. అలాగే, ఉత్తమ నటుడు తరుణ్, ఉత్తమ నటి రిచా పల్లోడ్, ఉత్తమ దర్శకుడు కె. విజయభాస్కర్, ఉత్తమ రచయిత త్రివిక్రమ్, ఉత్తమ సంగీత దర్శకుడు కోటి కి నంది వార్డులు కూడా తెచ్చిపెట్టింది.
* ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ఇప్పటికే టీవిలో వచ్చిన మిస్ అవకుండా చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు.