Salman-Dil Raju: సల్మాన్ తో దిల్ రాజు మూవీ.. డైరెక్టర్స్ ఎవరు దొరకడం లేదా.. మళ్ళీ అతనే..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి బాలీవుడ్ లో సినిమా (Salman-Dil Raju)చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డేట్స్ పట్టేశాడు.

Salman-Dil Raju: సల్మాన్ తో దిల్ రాజు మూవీ.. డైరెక్టర్స్ ఎవరు దొరకడం లేదా.. మళ్ళీ అతనే..

Producer Dil Raju is making a film with Salman Khan-Vamsi Paidipally combo

Updated On : October 13, 2025 / 10:12 AM IST

Salman-Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి బాలీవుడ్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డేట్స్ పట్టేశాడు. చాలా కాలంగా ఈ ప్రాజెక్టు గురించి వార్తలు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడంలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే, భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ సినిమాకు డైరెక్టర్ ను ఫిక్స్(Salman-Dil Raju) చేశాడట దిల్ రాజు. ఆ దర్శకుడు మరెవరో కాదు వంశీ పైడిపల్లి. అవును, రీసెంట్ గా వంశీ కూడా ముంబై వెళ్లి సల్మాన్ కి కథ కూడా న్యరెట్ చేశాడట. కథ, నచ్చడంతో వెంటనే ఒకే చేశాడట సల్మాన్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది.

Nuvve Kavali: క్లాసిక్ హిట్ ‘నువ్వే కావాలి’ సినిమాకి 25 ఏళ్ళు.. అప్పట్లోనే బాహుబలి రేంజ్ హిట్..

ఇక్కడివరకు బాగానే ఉంది కానీ, డైరెక్టర్ విషయంలో ఆడియన్స్ మాత్రం ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. వంశీ పైడిపల్లి గతంలో తమిళ స్టార్ విజయ్ తో “వరుసు” అనే సినిమా చేశాడు. ఇదే సినిమా తెలుగులో “వారసుడు” పేరుతో రిలీజ్ అయ్యింది. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి నెగిటీవ్ కామెంట్స్ వచ్చాయి. సీరియల్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. దానిపై దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే డైరెక్టర్ తో హిందీలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. దాంతో, మళ్ళీ రిస్క్ అవసరమా దిల్ మామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సల్మాన్ కి మాస్ అండ్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ, ఆయనతో కూడా వారసుడు లాంటి రొటీన్ కథ చేస్తే డిజాస్టర్ అవడం ఖాయం అంటున్నారు. అసలు వేరే డైరెక్టర్ ఎవరు దొరకడం లేదా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోని కథలో ఏమైనా కొత్తదనం తీసుకువస్తారా? డైరెక్టర్ ను మారుస్తారా? లేదా మళ్ళీ వారసుడు లాంటి సినిమా చేసి ఆడియన్స్ మొహాన కొడతారా అనేది చూడాలి.