Jai Hanuman: జై హనుమాన్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. ఇంకా షూట్ స్టార్ట్ అవలేదా.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు(Jai Hanuman). ప్రీక్వెల్ హైప్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎగబడ్డారు.

Jai Hanuman: జై హనుమాన్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. ఇంకా షూట్ స్టార్ట్ అవలేదా.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ!

Hero Rishab Shetty gives Jai Hanuman movie update

Updated On : October 13, 2025 / 10:47 AM IST

Jai Hanuman: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రీక్వెల్ హైప్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దాంతో, కేవలం వారంరోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక కాంతార చాప్టర్ 1 రిలీజ్ హడావుడి కంప్లీట్ అవడంతో తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు రిషబ్ శెట్టి. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తరువాతి సినిమా జై హనుమాన్(Jai Hanuman). దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

Salman-Dil Raju: సల్మాన్ తో దిల్ రాజు మూవీ.. డైరెక్టర్స్ ఎవరు దొరకడం లేదా.. మళ్ళీ అతనే..

తాజాగా జై హనుమాన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో రిషబ్ శెట్టి. కాంతార చాప్టర్ 1 ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జై హనుమాన్ గురించి మాట్లాడుతూ.. కాంతార చాప్టర్ 1 తరువాత నేను చేస్తున్న సినిమా జై హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమా 2026 జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. ఆతరువాత నా దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. మరో రెండేళ్లలో ఆ సినిమా విడుదల అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, జై హనుమాన్ సినిమా గురించి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఏంటి ప్రశాంత్ భయ్యా ఇది.. జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ అవలేదా. 2026 జనవరికి స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి, గతంలో జై హనుమాన్ సినిమా నుంచి రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు షూటింగ్ మొదలయ్యిందేమో అనుకున్నారు అంతా. కానీ, అది కేవలం ఫోటోషూట్ మాత్రమే అని అర్థం అయ్యింది. తాజాగా, రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ తో వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇక ఇవన్నీ చూస్తుంటే జై హనుమాన్ సినిమా రావడానికి మరో ఏడాది పట్టె అవకాశం ఉందని తెలుస్తోంది.