Sivakarthikeyan : శివకార్తికేయన్ మోసం చేశాడు.. తనతో మళ్ళీ పని చేయను.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

శివకార్తికేయన్ తనని మోసం చేశాడు అంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అతని నమ్మక ద్రోహం తన జీవితాన్ని మార్చివేసింది..

Sivakarthikeyan : శివకార్తికేయన్ మోసం చేశాడు.. తనతో మళ్ళీ పని చేయను.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

Sivakarthikeyan betrayed me comments by Music director Imman

Updated On : October 17, 2023 / 3:09 PM IST

Sivakarthikeyan : కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. నటుడిగానే కాకుండా సింగర్‌గా, లిరిక్ రైటర్‌గా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ఈ హీరోకి సంగీత దర్శకులతో ఒక ప్రత్యేక స్నేహం ఉంటుంది. ఈక్రమంలోనే తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఇమ్మాన్’తో కూడా మంచి స్నేహం ఉంది. అయితే ఇప్పుడు అది చెందినట్లు తెలుస్తుంది. శివకార్తికేయన్ తనని మోసం చేశాడు అంటున్న ఇమ్మాన్.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సంగీత దర్శకుడు మాట్లాడుతూ.. “శివకార్తికేయన్ చేసిన తీవ్ర నమ్మక ద్రోహం నా జీవితాన్ని మార్చివేసింది. తనతో కలిసి మళ్ళీ పని చేయడం అనేది జీవితంలో జరగదు. దానికి లోతైన వ్యక్తిగత కారణాలు ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు. అలాగే తన వేదనకు శివకార్తికేయన్ మాత్రమే ఏకైక కారణం కాదని, మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయని ఇమ్మాన్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా గతంలో వీరిద్దరి కలయికలో.. మనం కోతి పరవై, వరుత్తపడతా వాలిబర్ సంగం, రజినీమురుగన్, సీమరాజా, నమ్మ వీటు పిల్లై సినిమాలు వచ్చాయి.

Also read : Sreeleela : సినిమాలో అవి చేయడానికి ఇంకా టైం ఉంది అంటున్న శ్రీలీల

శివకార్తికేయన్ ప్రస్తుతం ‘అయలాన్’ అనే సినిమాని సిద్ధం చేస్తున్నాడు. ఏలియన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్, కామెడీ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో సాయి పల్లవి హీరోయిన్ గా మరో సినిమాని కూడా చేస్తున్నాడు.