Diwali Offer : రెడ్‌మి 15 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాలు హైలెట్.. జస్ట్ నెలకు రూ. 679 EMI అంతే..!
Diwali Offer : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అత్యంత సరసమైన ధరకే రెడ్‌మి ఫోన్ కొనేసుకోండి. కేవలం నెలకు రూ. 679 ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు.

Diwali Offer
Diwali Offer : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఇటీవల లాంచ్ అయిన రెడ్‌మి 15 5G ఫోన్ భారీ 7,000mAh బ్యాటరీ కలిగి ఉంది. అమెజాన్ దీపావళి ధమాకా సేల్ సమయంలో సరసమైన ధరకు కొనేసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ రెడ్‌మి ఫోన్ అసలు లాంచ్ ధర కన్నా రూ. 3వేలు తక్కువ ధరకు పొందవచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అద్భుతమైన (Diwali Offer) డిస్కౌంట్ పొందవచ్చు. ఈవీ-గ్రేడ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. కీలక హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లలో 50MP ప్రైమరీ కెమెరా, 8GB వరకు ర్యామ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
రెడ్‌మి 15 5G డిస్కౌంట్ :
రెడ్‌మి 15 5G ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఈ రెడ్‌మి 15 ఫోన్ ధర రూ. 16,999కు పొందవచ్చు. దీపావళి సేల్ సమయంలో ధర భారీగా తగ్గింది.
- 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ ధర రూ. 13,999
- 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ ధర రూ. 14,999
- 8 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ ధర రూ.15,999
ఈ ఫోన్ అమెజాన్, రెడ్‌మి అధికారిక స్టోర్‌లలో శాండీ పర్పుల్, ఫ్రాస్ట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి ఫోన్ నెలవారీ రూ. 679 ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మి 15 5G కీలక ఫీచర్లు :
ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..
- డిస్‌ప్లే : 144Hz హై రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో భారీ 6.9-అంగుళాల FHD+ డిస్‌ప్లే
- ప్రాసెసర్ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 5G ప్రాసెసర్
- OS : ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOSపై రన్ అవుతుంది.
- బ్యాటరీ : 33W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ.
- స్టోరేజీ : 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ రెండూ విస్తరించుకోవచ్చు.
- కెమెరాలు : బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ (50MP ప్రైమరీ కెమెరా) సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు 8MP కెమెరా సపోర్టు
- ఇతర ఫీచర్లు : ఏఐ ఫీచర్లు