Baahubali The Epic : బాహుబలి రెండు పార్టులు కలిపి రిలీజ్ చేయమని అప్పుడే చెప్పాడుగా.. ఎనిమిదేళ్ల క్రితం ట్వీట్ వైరల్
బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలా రిలీజ్ చేయమని ఓ వ్యాపారవేత్త ఎనిమిదేళ్ల క్రితమే తన ట్విట్టర్లో చెప్పాడు. (Baahubali The Epic)

Baahubali The Epic
Baahubali The Epic : బాహుబలి సినిమా తెలుగు పరిశ్రమ స్థాయిని ఏ రేంజ్ లో పెంచిందో అందరికి తెలిసందే. బాహుబలి పార్ట్ 1 మించి పార్ట్ 2 పెద్ద విజయం సాధించింది. రాజమౌళి ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి పాన్ ఇండియా సినిమాలకు రోడ్ వేశారు. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ బాహుబలిని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి రెండు పార్టులని కలిపి ఎడిటింగ్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేస్తున్నారు.(Baahubali The Epic)
బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలా రిలీజ్ చేయమని ఓ వ్యాపారవేత్త ఎనిమిదేళ్ల క్రితమే తన ట్విట్టర్లో చెప్పాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ అంటే హరితేజకు ఎంత ఇష్టమో.. బన్నీ కోసం ఏకంగా 15 రోజులు ఏం చేసిందో తెలుసా?
2017లో బాహుబలి 2 సినిమా విడుదలైన వారానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మే 6వ తేదీ 2017న ఓ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో.. రాజమౌళి గారు… బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా 500 కోట్లు కలెక్షన్స్ రాబట్టచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు అని ట్వీట్ వేశారు.
దీంతో ఎనిమిదేళ్ల క్రితం లాయిడ్ గ్రూప్ అధినేత వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన ఎప్పుడో ఈ సలహా ఇచ్చాడు, ఇప్పుడు నిజం అవుతుందని నెటిజన్లు అంటున్నారు.
Also Read : Hariteja : బిగ్ బాస్ హౌస్ లోకి పాములు వచ్చేవి.. లైఫ్ లో ఇంకోసారి బిగ్ బాస్ కి వెళ్ళను.. చిరాకు వచ్చింది..