Mulakalacheruvu Fake Liquor Case: నకిలీ లిక్కర్ కేసు.. బయటపడుతున్న జోగి రమేశ్ లింకులు.. ఫోటోలు లీక్..
జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఇప్పటికే జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలంతో పాటు..

Mulakalacheruvu Fake Liquor Case: ఏపీలో సంచలనం రేపిన నకిలీ లిక్కర్ కేసులో వైసీపీ నేత జోగి రమేశ్ కి ఉన్నటువంటి లింకులు బయటపడుతున్నాయి అనే ప్రచారం ఊపందుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్ధన్ రావు, ఆయన సోదరుడితో జోగి రమేశ్ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఇప్పటికే జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలంతో పాటు వాట్సాప్ చాట్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు నిందితులతో కలిసి దిగిన ఫోటోలు లీక్ అవడంతో జోగి రమేశ్ పై అనుమానాలు బలపడుతున్నాయి.
నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేని వైసీపీ నేత జోగి రమేశ్ చెబుతూ వస్తున్నారు. అయితే, నకిలీ మద్యం స్కామ్ లో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్ మోహన్ రావుతో జోగి రమేశ్ దిగిన ఫోటోలు బట్టబయలయ్యాయి. దీంతో జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నకిలీ లిక్కర్ కేసుతో, నిందితులతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేశ్ బలంగా చెప్పారు. అంతేకాదు దీనిపై ప్రమాదం చేద్దామని సీఎం చంద్రబాబుకి సైతం సవాల్ విసిరారు. కట్ చేస్తే.. నిందితులతో ఆయన కలిసి దిగిన ఫోటోలు బయట పడటం కలకలం రేపుతోంది. ఈ అంశం ఇప్పుడు రసవత్తరంగా మారింది. దీనికి జోగి రమేశ్ ఎటువంటి వివరణ ఇస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
నకిలీ మద్యం వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. ఎక్కడా కల్తీ మద్యం అన్నది లేకుండా చూసేలా హోలోగ్రామ్స్ ఏర్పాటు చేసింది. స్కానింగ్ కూడా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. కల్తీ మద్యానికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న అంశం బయటపడినా.. ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందిస్తోంది. ప్రధాన నిందితుడు జనార్ధన్ తో ఎవరెవరికి లింకులు ఉన్నాయో అన్నది వెలికి తీస్తోంది. జోగి రమేశ్ తమతో ఇవన్నీ చేయించారని స్వయంగా జనార్ధన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిందితుడు జనార్దన్, జోగి రమేశ్ కలిసున్న ఫోటోలు బయటకు రావడం చాలా సంచలనంగా మారింది. ఈ ఆధారాలను బేస్ చేసుకుని పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. వైజాగ్ గురించి, పెట్టుబడుల గురించి సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..