Cm Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్..

ప్రతి వారం సీఎస్, సీఎంవో అధికారులు నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

Cm Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్..

Updated On : October 18, 2025 / 11:35 PM IST

Cm Revanth Reddy: ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు అంటూ సూచనలు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రెండేళ్లు కావొస్తున్నా కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అంటూ కూడా సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ తేల్చి చెప్పారు.

ఇకపై అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని, ప్రతి వారం సీఎస్, సీఎంవో అధికారులు నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిపై సీఎస్ నిరంతరం సమీక్షించాలన్నారు. ఎక్కడా ఫైల్స్ ఆగిపోకుండా, పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోంది. అయితే, కొంతమంది అధికారుల పనితీరు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అలసత్వం వీడాలని అధికారులకు చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అధికారులు తమ పనితీరు మార్చుకోవాలి, వేగం పెంచాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంకా కొందరు అధికారులు విధుల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని తనకు రిపోర్ట్ అందిందన్నారు. అలాంటి అధికారులు ఇకనైనా తమ తీరు మార్చుకోవాల్సిందేనని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు పని చేయొద్దని ప్రధానంగా సూచించారు. కేంద్ర నిధులకు సంబంధించి రాష్ట్రం వాటా చెల్లించాల్సి ఉంటుంది. దాంతో కేంద్రం నుంచి గ్రాంట్స్ వస్తుంటాయి. ఇలాంటి పథకాల విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కు సంబంధించి, రాష్ట్ర పథకాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు సూచించాలన్నారు. దీనికి సంబంధించి ప్రతివారం రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: చంద్రసేనుడు, రామసేనుడు, హరిసేనుడు.. అంటూ కథ చెప్పి.. నవ్వులు పూయించిన సీఎం రేవంత్ రెడ్డి..