Cm Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. నవంబర్ 1 నుంచి.. నెలకు రూ.160 కోట్లు..

కేంద్రం ఇచ్చిన నిధుల దుర్వినియోగం వల్ల ఆ ప్రభావం ఉద్యోగులపైనా పడింది.

Cm Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. నవంబర్ 1 నుంచి.. నెలకు రూ.160 కోట్లు..

Updated On : October 18, 2025 / 11:46 PM IST

Cm Chandrababu: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నవంబర్ 1న వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇందుకుగాను ప్రభుత్వంపై ప్రతి నెల రూ.160 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే పోలీసులకు ఈఎల్, ఒక ఇన్ స్టాల్ మెంట్ ఇస్తామన్నారు. 60 రోజుల్లోపు ఉద్యోగుల మెడి క్లెయిమ్స్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్ లో ఉందన్నారు. అది కూడా త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు.

మంత్రులు, ఉద్యోగ సంఘాల నేతలతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఇందులో ఉద్యోగుల సమస్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులున్నా డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పారు. పీఆర్సీపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇది ఆరంభం మాత్రమే, ఇది శుభ పరిణామం అని చంద్రబాబు అన్నారు. ప్రతీ ఉద్యోగి ఆనందంగా దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు రేపటి నుంచి మరింత ఉత్సాహంగా పని చేయాలని, సంపద సృష్టిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంపద సృష్టిలో రెండో స్థానానికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం మొదటి స్థానానికి వచ్చేందుకు కృషి చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

”కూటమి ప్రభుత్వం అందరినీ గౌరవిస్తుంది. ఎవరినీ కిoచపరచదు. ఉద్యోగులు, ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల 94 కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులు ఆగిపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల దుర్వినియోగం వల్ల ఆ ప్రభావం ఉద్యోగులపైనా పడింది. ఉద్యోగుల బాధలను ప్రభుత్వం అర్ధం చేసుకుంది. 16 నెలల నుంచి సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. బకాయిలు తీర్చాం.

నవంబర్ లో 105 కోట్లు, జనవరిలో 105 కోట్లు..

74 కేంద్ర ప్రాయోజిత పథకాలను క్రమబద్దీకరించాం. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా దీపావళి ముందు ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు ఇస్తున్నాo. ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబర్ నుంచి నెలకు రూ. 160 కోట్ల చొప్పున ఈ భారం భరిస్తాం. పోలీసులకు ఒక ఇన్ స్టాల్ మెంట్ ఈఎల్ ఇస్తాం. ఒక సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. రెండు విడతల్లో సరెండర్ లీవ్ చెల్లింపులు చేస్తాం. నవంబర్ లో 105 కోట్లు, జనవరిలో 105 కోట్లు ఇస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ 180 రోజులను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతున్నాo.

దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ క్లియర్ చేస్తున్నాం. కొంత సమయం తీసుకుని పీఆర్సీ కూడా ఇస్తాం. సీపీఎస్ పై చర్చించి త్వరలో పరిష్కరిస్తాం. ఉద్యోగ సంఘాల భవనాల ఆస్తి పన్ను మాఫీ. ఉద్యోగుల హెల్త్ వ్యవస్థను 60 రోజుల్లోపు స్ట్రీమ్ లైన్ చేస్తాం. నాలుగో తరగతి ఉద్యోగుల గౌరవం పెంచేలా రీడెసిగ్నేట్ చేస్తాం. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ” అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Also Read: జీరో కామెంట్స్ మీద బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నారాయణ.. చంద్రబాబు దూకమంటే దూకుతా అంటూ వర్మ స్టేట్‌మెంట్‌.. ఏం జరుగుతోంది?