Bigg Boss 7 : నామినేషన్స్ హీట్ మొదలైంది.. శోభా వర్సెస్ శివాజీ, ప్రియాంక వర్సెస్ బోలే
బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడు వారాలు పూర్తి అయ్యాయి. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఎనిమిదో వారం మొదలైంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారో అనే ఆసక్తి అందరిలో ఉంది.

Bigg Boss Telugu 7 Day 49 Promo
Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడు వారాలు పూర్తి అయ్యాయి. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఎనిమిదో వారం మొదలైంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారో అనే ఆసక్తి అందరిలో ఉంది. బిగ్‌బాస్ సైతం నామినేషన్స్ ప్రక్రియ మొదలెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఇంటి సభ్యులు తాము నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ల ఫోటోలను మంటల్లో వేయాలని సూచించాడు. నామినేషన్‌కు తగిన కారణాలు చెప్పాలని అన్నాడు.
ఈ ప్రొమోను బట్టి చూస్తుంటే శివాజీ-శోభాశెట్టి, బోలే-ప్రియాంక జైన్‌ల మధ్య వాడీ వేడీ మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. గతవారంలో ప్రియాంక, శోభాలు బోలేపై బూతు పదాలతో విరుచుకుపడడం తెలిసిందే. దీన్ని కారణంగా శోభాను నామినేట్ చేస్తున్నట్లు శివాజీ చెప్పాడు. భోలే తప్పుగా మాట్లాడాడు. కానీ వెంటనే సారీ కూడా చెప్పాడు. తోటి మనిషే కదా.. క్షమిస్తే ఏం పోద్ది అనేది ఒక అభిప్రాయం అంటూ శివాజీ అన్నాడు. మీకు క్షమించే మనసిచ్చాడు.. నాకు ఇవ్వలేదంటూ శోభా సమాధానం చెప్పింది.
ఆ తరువాత డాక్టర్ బాబు రైతుబిడ్డ ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ప్రశాంత్ ఫోటోను గౌతమ్ మంటల్లో వేయగా.. నా ఫొటో కాలిపోతుందన్నా.. నా గుండెల్లో నిప్పు మాత్రం ఇట్లా ఇట్లా వెలుగుతూనే ఉంటుందనే డైలాగ్ చెప్పాడు. భోలేను ప్రియాంక నామినేట్ చేసింది. ఈ క్రమంలో బోలే మేనరిజాన్ని వెక్కిరించి చూపించింది. ఈ క్రమంలో నీకెందుకు నా బాడీ లాంగ్వేజ్ అంటూ బోలే అన్నాడు. మొత్తానికి ప్రొమోనే హీటెక్కించేలా ఉంటే.. పుల్ ఎపిసోడ్ ఇంకా ఎలాగ ఉంటుందో మరీ