Abhai : అభ‌య్‌కు కోప‌మొచ్చింది.. ఇవేం రూల్స్‌.. తిన‌డానికా, తిన‌కుండా ఉండ‌డానికా?

బిగ్ బాస్ సీజన్ 8లో మూడో వారం కొన‌సాగుతోంది.

Bigg Boss Telugu 8 Day 18 Promo 2 Moving Platform Task

బిగ్ బాస్ సీజన్ 8లో మూడో వారం కొన‌సాగుతోంది. కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి టాస్కులు ఆడిస్తున్నాడు బిగ్‌బాస్‌. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో 2 విడుద‌లైంది. కిచెన్‌లో కొత్త రూల్‌ను పెట్టారు.

ఒక క్లాన్ వంట చేసేట‌ప్పుడు మ‌రో క్లాన్‌కు చెందిన స‌భ్యులు కిచెన్‌లో ఉండ‌రాదు. అదే స‌మ‌యంలో ముగ్గురు మాత్ర‌మే కిచెన్‌లో ఉండాల‌ని, కూర‌గాయ‌లు క‌ట్ చేయ‌డంతో క‌లిపి ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. దీనిపై అభయ్ ఫైర్ అయ్యాడు.

Salman Khan : స‌ల్మాన్ ఖాన్ తండ్రికి మ‌హిళ‌ బెదిరింపు

ముగ్గురు ఎట్లా వండుతారు అంత మందికి.. తిన‌డానికి టాస్కులు పెడుతున్నారా? తిన‌కుండా ఉండ‌డానికి టాస్కులు పెడుతున్నారా అంటూ లేచి వెళ్లిపోయాడు. చూస్తుంటే బిగ్‌బాస్ కొత్త రూల్‌కు మ‌నోడు కాస్త గ‌ట్టిగానే హ‌ర్ట్ అయిన‌ట్లుగా ఉన్నాడు.

ఆ త‌రువాత మూవీంగ్ ఫ్లాట్‌ఫామ్ అనే మ‌రో టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్‌. దీనిలో ఎవ‌రు విజేత‌లుగా నిలిచారో చూడాలి.

Aditi Rao Hydari : హీరోయిన్ అదితిరావు హైద‌రి మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా?