Salman Khan : సల్మాన్ ఖాన్ తండ్రికి మహిళ బెదిరింపు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ కు బెదిరింపులు ఎదురు అయ్యాయి.

Salman Khan father Salim Khan threatened by woman with lawrence bishnoi name
Salman Khan father : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ కు బెదిరింపులు ఎదురు అయ్యాయి. సలీమ్‌ఖాన్ మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి, బురఖా ధరించిన ఓ మహిళ.. స్కూటర్ పై వచ్చి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరును ఉటంకిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై ఆయన బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ పుటేజీలను స్కాన్ చేస్తున్నారు.
సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి నుంచి పలుమార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ నివాసం పై కాల్పులు జరిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 1700లకు పైగా పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Devara : దేవర కొత్త పోస్టర్ రిలీజ్.. ఫస్ట్ టైం ముగ్గురితో.. దేవర, భైరా, తంగమ్ లతో..
ఘటన జరిగిన సమయంలో సల్మాన్‌ఖాన్ ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో తాను నిద్రపోతున్నానని, బుల్లెట్ల శబ్దంతోనే నిద్ర లేచినట్లు సల్మాన్ అందులో పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని చంపేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు తెలుస్తోందని సల్మాన్ ఖాన్ తెలిపారు.