Devara : దేవర కొత్త పోస్టర్ రిలీజ్.. ఫస్ట్ టైం ముగ్గురితో.. దేవర, భైరా, తంగమ్ లతో..

తాజాగా దేవర సినిమాలో ముగ్గురూ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు.

Devara : దేవర కొత్త పోస్టర్ రిలీజ్.. ఫస్ట్ టైం ముగ్గురితో.. దేవర, భైరా, తంగమ్ లతో..

Devara

Updated On : September 19, 2024 / 2:15 PM IST

Devara : దేవర సినిమా బయట ప్రమోషన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హడావిడి చేస్తుంది. దేవర అకౌంట్ లో రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. దేవర పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ హైప్ మరింత పెంచడానికి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ, ట్వీట్స్ చేస్తుంది దేవర టీమ్.

Also Read : Kangana Ranaut : పాపం సినిమా కోసం ఆస్తులు అమ్ముకున్న కంగ‌నా ర‌నౌత్‌..

ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని సింగిల్ క్యారెక్టర్ పోస్టర్స్. ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్.. ఇలా అందరివీ సింగిల్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసారు. తాజాగా దేవర సినిమాలో ముగ్గురూ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు. మరోసారి దేవర రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ ముగ్గురూ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

Image

దేవర సినిమాలో ఎన్టీఆర్ – దేవర, వర పాత్రలు చేస్తుండగా సైఫ్ అలీఖాన్ భైరా పాత్ర, జాన్వీ కపూర్ తంగమ్ పాత్రలో కనిపించబోతున్నారు.