Bigg Boss 8 : పృథ్వీ వేసుకున్న ష‌ర్ట్ అత‌డిది కాదా? విష్ణు ప్రియా ఎంత ప‌ని చేశావ‌మ్మా

బిగ్‌బాస్ సీజ‌న్ 8లో మూడో వారం ఆఖ‌రికి వ‌చ్చేసింది.

Bigg Boss Telugu 8 Day 21 Promo Set or Cut Challenge

Bigg Boss 8 : బిగ్‌బాస్ సీజ‌న్ 8లో మూడో వారం ఆఖ‌రికి వ‌చ్చేసింది. ఈ వారం ఎవ‌రు ఎలిమినేషన్ కానున్నారు అనే దానిపై అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. ఈ వారం నామినేష‌న్‌లో మొత్తం ఎనిమిది మంది విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, సీత, అభయ్, నైనిక ఉన్నారు. కాగా.. నేపిఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వ‌చ్చేసింది.

‘కొట్ట‌రా కొట్టు తీన్‌మార్’అనే సాంగ్‌తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. పృథ్వీ మంచి హుషారుగా ఉన్నాడుగా అన‌గా.. వెంట‌నే విష్ణు అవును సార్‌.. అయితే అత‌డు వేసుకున్న ష‌ర్ట్ త‌న‌ది కాదు అని చెప్పింది. ఎవ‌రిది అని అడుగ‌గా.. నిఖిల్‌ది అని చెప్పింది. ఆ త‌రువాత‌ సండే ఫ‌న్ డే అంటూ కంటెస్టంట్ల‌తో నాగ్ ఆట‌లు ఆడించారు. సెట్ అయిన వాళ్ల‌కు హార్ట్ ఇవ్వాల‌ని, కాని వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లి హార్ట్‌ను బ్రేక్ చేయాల‌ని చెప్పాడు. మొత్తంగా ప్రొమో చూస్తుంటే ఫ‌న్ ఫుల్‌గా సాగింది.

Vinay Rai : ఒకప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడేమో స్టార్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా..?