Bigg Boss Telugu 8 Day 31 Promo 2 Bigg Boss Shocking Twist
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో వారం కొనసాగుతోంది. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమోను విడుదల చేశారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లు అన్ని పూర్తి చేయలేకపోవడంతో 8 మంది వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు రాబోతున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించారు. ఆ తరువాత చీఫ్ కోసం టాస్క్‌ను పెట్టారు. పేర్లతో ఉన్న కుక్క బొమ్మలను యాక్షన్ ఏరియాలో ఉంచారు.
బజర్ మోగిన తరువాత హౌస్‌మేట్స్ అంతా పప్పీలను తీసుకువచ్చి వాటి వాటి హౌస్‌ల్లో పెట్టాల్సి ఉంది. ఎవరైతే చివరిగా పప్పీని హౌస్‌లోకి తీసుకువస్తారో.. అలాగే ఆ పప్పీ మెడలో ఉన్న ట్యాగ్ మీద పేరు ఉన్న సభ్యుడు డేంజర్‌లో ఉంటాడని బిగ్‌బాస్ తెలిపాడు. తొలుత యష్మి చివరిగా లోపలికి వచ్చింది. దీంతో యష్మితో పాటు ఆమె చేతిలో ఉన్న పప్పీ మెడలో ప్రేరణ పేరు ఉండడంతో వీరిద్దరు డేంజర్ జోన్‌లోకి వచ్చారు.
Pawan kalyan: తిరుమల కొండపైనే పవన్ రాత్రికి బస.. పవన్ చేతిలోఉన్న వారాహి బుక్ లో ఏముందంటే?
వీరిద్దరిలో చీఫ్ రేస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. వీరిద్దరూ వారి వారి వెర్షన్స్‌ను హౌస్‌మేట్స్‌కు చెప్పుకున్నారు. అనంతరం యష్మి, మణికంఠలు పక్కపక్కనే నిలబడగా.. పృథ్వీ మాట్లాడుతూ చీఫ్‌కి విన్నింగ్ క్వాలిటీ ఉండాలి అని అన్నాడు. విన్ అయితేనే చీఫ్‌గా ఉండాలా అని నాగ మణికంఠ ప్రశ్నించాడు. ఇందుకు ఔను అని పృథ్వీ సమాధానం ఇచ్చాడు. యష్మీకి పృథ్వీ ఓటు వేయగా.. నాకు అర్థమైంది అంటూ మణికంఠ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా కనిపించింది. దీనికి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావ్ పృథ్వీ.. అంటూ యష్మి అంది. తనను హౌస్ కార్నర్ చేసిందంటూ మణికంఠ తన వెర్షన్ చెబుతుంటే యష్మీ, సీత, నైనిక అందరూ మణికంఠపై మండిపడ్డారు.
ఈ క్రమంలో యష్మి రెచ్చిపోయింది. అసలు వాడికి ఈ హౌస్‌లో చీఫ్‌గా ఉండే అర్హతే లేదు అంది. దీనికి మణికంఠ మాట్లాడుతూ.. ఏదో ఒకరోజు నేను చీఫ్ అయి చూపిస్తానంటూ సవాల్ చేశాడు. అవ్వరా అవ్వు.. ఎట్లా అవుతావో నేను చూస్తా అంటూ తనదైన శైలిలో ఛాలెంజ్ చేసింది.