Pawan kalyan: తిరుమల కొండపైనే పవన్ రాత్రికి బస.. పవన్ చేతిలోఉన్న వారాహి బుక్ లో ఏముందంటే?

పవన్ కల్యాణ్ స్వామివారి దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు పొందారు.

Pawan kalyan: తిరుమల కొండపైనే పవన్ రాత్రికి బస.. పవన్ చేతిలోఉన్న వారాహి బుక్ లో ఏముందంటే?

Pawan kalyan

Updated On : October 2, 2024 / 2:43 PM IST

Pawan kalyan in Tirumala: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం తిరుమలలో దీక్షను విరమించారు. మంగళవారం సాయంత్రం తిరుమల మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ పవన్ కల్యాణ్ కొండపైకి చేరుకున్నారు. బుధవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్న పవన్.. గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

Also Read : Pawan Kalyan : తిరుమల నిత్య అన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆ తరువాత టీటీడీ అధికారులతో సమావేశం అయ్యారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే పవన్ బస చేయనున్నారు. గురువారం సాయంత్రం 4గంటలకు కొండ కిందకు చేరుకొని తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు.

 

పవన్ కల్యాణ్ స్వామివారి దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం బయట మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. బుక్ కవర్ పేజీ పైభాగంలో !! ధర్మో రక్షతి రక్షితః !!’ అని రాసి ఉంది. బుక్ మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం.. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్‌ అని ఉంది. అయితే, ఈ వారాహి డిక్లరేషన్ బుక్ ను సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. గురువారం తిరుపతి నగరంలో జరిగే వారాహి సభలో ఈ బుక్ గురించి పవన్ వివరించే అవకాశం ఉంది.