Bigg Boss 8 : ప్రేరణపై పృథ్వీ పగ.. గ‌రంగ‌రంగా నామినేష‌న్స్‌

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఏడో వారం మొద‌లుకాబోతుంది.

Bigg Boss Telugu 8 Day 43 Promo 2 Contestants intense face off During Nominations

Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఏడో వారం మొద‌లుకాబోతుంది. ప్ర‌స్తుతం హౌస్‌లో 15 మంది ఉన్నారు. ఇక సోమ‌వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోల‌ను విడుద‌ల చేశారు. ఈ సారి నామినేష‌న్స్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్‌.

హౌస్ మేట్స్ ఇద్ద‌రిని నామినేట్ చేయాలి. వీరిద్ద‌రిలో ఎవ‌రిని నామినేష‌న్స్‌లో పంపాలి అనేది కిల్ల‌ర్ గ‌ర్ల్స్ అయిన ప్రేర‌ణ‌, హ‌రితేజ లు నిర్ణ‌యిస్తారు. అయితే.. ఇందుకు సౌండ్ వ‌చ్చిన‌ ప్ర‌తిసారి ప్రేర‌ణ‌, హ‌రితేజ‌లు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్ ప‌ట్టుకోవాల్సి ఉంటుంది. వీరిద్ద‌రిలో ఎవ‌రు హ్యాట్ ప‌ట్టుకుంటారో వారికి నిర్ణ‌యాధికారం ఉంటుంది.

Kiran Abbavaram – Allu Arjun : మొద‌టి రోజు, చివ‌రి రోజు అల్లు అర్జున్ అన్న నా షూటింగ్‌కు వ‌చ్చి.. ఏమ‌న్నారంటే?

గౌత‌మ్‌ను రోహిణి నామినేట్ చేసింది. ఈ క్ర‌మంలో వారిద్ద‌రి మ‌ధ్య అశ్వ‌ర్థామ పాయింట్ పై వాగ్వాదం జ‌రిగింది. ఇక అవినాష్ సైతం గౌత‌మ్ పై మండిప‌డ్డాడు. పృథ్వీ బీబీ హోటల్‌ టాస్క్‌లో సరిగా ఆడలేదంటూ గంగవ్వనామినేట్‌ చేసింది. గంగవ్వ చెప్పినదానితో ప్రేరణ ఏకీభవించింది. దీంతో పృథ్వీ నామినేట్‌ అయ్యాడు. తాను నామినేట్ కావడంతో ప్రేర‌ణ‌పై మండిప‌డ్డాడు పృథ్వీ. త‌న‌కు సాయం చేయ‌వ‌ద్ద‌ని నిఖిల్‌ను హెచ్చ‌రించాడు.

ఇక ఏడోవారం నిఖిల్‌, పృథ్వీ, గౌతమ్‌, యష్మి, నబీల్‌, తేజ, మణికంఠ, అవినాష్‌, ప్రేరణలో నామినేష‌న్స్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాయల్ టీమ్‌కు ఒక‌రిని స్వాప్ చేసే ఛాన్స్ వ‌చ్చింది.

Raja Saab : ప్రభాస్ బర్త్ డేకి రాజాసాబ్ టీజర్..? అప్పట్నుంచి వరుస అప్డేట్స్..