Kiran Abbavaram – Allu Arjun : మొద‌టి రోజు, చివ‌రి రోజు అల్లు అర్జున్ అన్న నా షూటింగ్‌కు వ‌చ్చి.. ఏమ‌న్నారంటే?

కిరణ్‌ అబ్బవరం హీరోగా న‌టిస్తున్న‌ పాన్‌ ఇండియా మూవీ ‘క’.

Kiran Abbavaram – Allu Arjun : మొద‌టి రోజు, చివ‌రి రోజు అల్లు అర్జున్ అన్న నా షూటింగ్‌కు వ‌చ్చి.. ఏమ‌న్నారంటే?

Kiran Abbavaram comments in ka movie press meet

Updated On : October 14, 2024 / 5:09 PM IST

Kiran Abbavaram – Allu Arjun : కిరణ్‌ అబ్బవరం హీరోగా న‌టిస్తున్న‌ పాన్‌ ఇండియా మూవీ ‘క’. న‌య‌న్ సారిక‌, తన్వీ రామ్ క‌థానాయిక‌లు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ సంయుక్త ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. దీపావ‌ళి కానుక‌గా ఈ నెల 31న తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ బాష‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈక్ర‌మంలో విలేకరుల స‌మావేశంలో ‘క’ టీమ్ పలు విశేషాల‌ను పంచుకుంది. ఈ సంద‌ర్భంగా హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు సార్లు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. కిర‌ణ్ నువ్వు హిట్ కొట్టాల‌ని అని బ‌న్నీ చెప్ప‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నారు.

Raja Saab : ప్రభాస్ బర్త్ డేకి రాజాసాబ్ టీజర్..? అప్పట్నుంచి వరుస అప్డేట్స్..

‘సార‌థి స్టూడియోలో ఒకేసారి క‌, పుష్ప 2 సినిమాల షూటింగ్ జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో అల్లు అర్జున్ మా సినిమా సెట్స్‌కు రెండు (షూటింగ్ ప్రారంభ‌మైన మొద‌టి రోజు, ఆఖ‌రి రోజు) సార్లు వ‌చ్చారు. కిర‌ణ్‌.. నువ్వు హిట్ కొట్టాలి అని అల్లుఅర్జున్‌ అన్నారు. ఆ మాట‌లు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి.’ అని కిర‌ణ్ అబ్బ‌వ‌రం అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shreyas Media (@shreyasgroup)