Bigg Boss Telugu 9 Grand Launch on Sep 7th
Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈ షోను ఎంతో ఇష్టంతో చూస్తుంటారు. ఈ రియాలిటీ షో విజయవంతంగా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక తొమ్మిదో సీజన్(Bigg Boss Telugu 9)కు రంగం సిద్ధమైంది.
ఈ సీజన్‌లో సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా షోలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే 15 మంది సామాన్యులను బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. వీరిలో ఎవరు షోలో ఉంటారో అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక తొమ్మిదో సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vedavyas : కొరియన్ అమ్మాయిని టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సీనియర్ డైరెక్టర్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9.. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఇక ఈ సారి బిగ్‌బాస్‌ను మార్చేసినట్లుగా నాగ్ చెప్పాడు. అంటే బిగ్‌బాస్ వాయిస్ మారొచ్చు.
ఇదిలా ఉంటే.. ఇక ఈ సారి రెండు హౌస్‌లు ఉంటాయట. ఒకటి సెలబ్రెటీల కోసం మరొకటి సామాన్యుల కోసం అని తెలుస్తోంది.