Vedavyas : కొరియన్ అమ్మాయిని టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సీనియర్ డైరెక్టర్..
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆయన దర్శకత్వంలో వేద వ్యాస్ (Vedavyas) అనే మూవీ

SV Krishnareddy 43rd film vedavyas launched today
Vedavyas :ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆయన దర్శకత్వంలో వేద వ్యాస్ (Vedavyas) అనే మూవీ తెరకెక్కుతోంది. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్‌లో 43వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్ర షూటింగ్ గురువారం ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది.
Gods and Soldiers : తమిళ్ సినిమా ఫ్రాంచైజ్ లో రాజ్ తరుణ్ హీరోగా.. టైటిల్ టీజర్ భలే ఉందే..
ముహూర్తపు షాట్ కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్ గా పరిచయం కానుంది.
కాగా.. ఈమూవీ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మంచి సందేశంతో కూడుకున్న కమర్షియల్ సినిమాగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం ఎస్వీ కృష్ణారెడ్డి స్వయంగా అందిస్తున్నారు.