BiggBoss Telugu 7 Promo
BiggBoss 7 New Promo : తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ (BiggBoss) రియాలిటీ షో కు యమా క్రేజ్ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో సీజన్‌పై అంచనాలను పెంచేందుకు బిగ్‌బాస్ బృందం ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా వరుసగా ప్రొమోలను విడుదల చేసింది.
Devara : ఒకటి కాదు, రెండు కాదు.. అన్ని యాక్షన్ షెడ్యూల్సే.. దేవర వేట మూమూలుగా లేదుగా..
టైటిల్ లోగో, టీజర్‌ను రివీల్ చేయగా న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూరూల్స్ అంటూ షో పై ఇప్పటికే హోస్ట్ నాగార్జున (Nagarjuna) అంచనాలను పెంచేశారు. తాజాగా మరో ప్రొమోను బిగ్‌బాస్ బృందం విడుదల చేసింది. గత సీజన్ల మాదిరి ఈ సీజన్ ఉండదని చెబుతున్నారు. ఆరు సీజన్లు చూసేశాం. ఇక అంతా మాకు తెలుసు అని కంటెస్టెంట్లు అనుకుంటే పొరబాటే. పాపం పసివాళ్లు, మన ప్లాన్స్ వాళ్లు తెలియదు కదా. న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూ బిగ్‌బాస్, ఈ సారి బిగ్‌బాస్ 7.. ఉల్టా పల్టాగా ఉంటుందని ప్రొమోలో కింగ్ నాగార్జున చెప్పాడు.
Pawan Kalyan : వరుసగా మూడుసార్లు 100 కోట్లు మూవీస్.. ఆ క్లబ్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?
ఇక నాగార్జున మాటలు వింటుంటే ఈ సారి మాత్రం బిగ్‌బాస్ గత సీజన్ల మాదిరి ఉండబోదని, సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేసినట్లుగా అర్థం అవుతోంది. మరీ షో ఎలా ఉండబోతుంది. పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగక తప్పదు. ఇక ఆడియన్స్ కూడా ప్రతి సారీలా కాకుండా కొత్తగా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటున్నారు. చివరి మూడు సీజన్లు సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభం అయ్యాయి. ఈ లెక్కన ఈ సారి కూడా సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆడియన్స్‌కు ఏదైన సర్‌ప్రైజ్ ఇవ్వాలని బిగ్‌బాస్ బావిస్తే మాత్రం ఆగస్టు చివరి వారంలోనే షో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.