Bigg Boss Telugu Season 8 Sunday Special Promo watch here
Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నేడు ఆరో వారం చివరికి వచ్చేసింది. ఇక ఆదివారం ఎపిసోడ్ అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు గెస్టులు, ఎలిమినేషన్లు ఉంటాయని తెలిసిందే. ఇక ఈ వారం పండగ కూడా ఉండటంతో మరింత స్పెషల్ గా ఉండబోతుంది. తాజాగా నేడు ఆదివారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
నేడు హౌస్ లో బతుకమ్మ ఆడించారు. బతుకమ్మతో డ్యాన్సులు వేశారు. అలాగే హౌస్ లోకి సింగర్ మంగ్లీ వెళ్లి కాసేపు సందడి చేసింది. విశ్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీను వైట్ల, గోపీచంద్ కలిసి బిగ్గబోస్ కి రాగా కంటెస్టెంట్స్ శ్రీను వైట్ల సినిమాల్లోని కామెడీతో నటించి అలరించారు. ఇక నాగార్జున శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన కింగ్ సినిమా జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
Also Read : Amardeep : హీరోగా బిగ్ బాస్ అమర్‌దీప్ మరో సినిమా.. ప్రేమకథతో..
అలాగే కంటెస్టెంట్స్ కి టాస్కులు గట్టిగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలని ఉప్పు బస్తాలుగా ఎత్తుకొని చేసే టాస్క్ ఏదో పెట్టారు. అలాగే పాటని బట్టి దాంట్లో ఉన్న వస్తువులను తెచ్చే టాస్క్ పెట్టారు. ఇలా పలు టాస్కులు అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. ఇక ఇవాళ ఆదివారం కావడంతో డింపుల్ హయతి, ఫరియా అబ్దుల్లా, అమృతా అయ్యర్ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సులు ఇచ్చారు. ప్రోమోని చాలా పెద్దగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ చేయడంతో నేడు ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉండబోతుందో అని బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక నేటి ఎపిసోడ్ లో కిరాక్ సీత ఎలిమినేట్ అవుతుందని సమాచారం.
మీరు కూడా ఆదివారం స్పెషల్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..