Amardeep : హీరోగా బిగ్ బాస్ అమర్‌దీప్ మరో సినిమా.. ప్రేమకథతో..

దసరా రోజు అమర్‌దీప్ హీరోగా మరో సినిమాని ప్రకటించారు.

Amardeep : హీరోగా బిగ్ బాస్ అమర్‌దీప్ మరో సినిమా.. ప్రేమకథతో..

Amardeep Chowdary Lishi Ghanesh New Movie Opening on Dasara

Updated On : October 13, 2024 / 10:38 AM IST

Amardeep : సీరియల్స్ తో పాపులర్ అయిన అమర్‌దీప్ బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేస్తున్నాడు. తాజాగా దసరా రోజు అమర్‌దీప్ హీరోగా మరో సినిమాని ప్రకటించారు. సినిమా ఓపెనింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు.

Also Read : Balakrishna – Sunny Deol : బాలీవుడ్ స్టార్ తో బాలయ్య.. మాస్ ఫీస్ట్ అంటూ..

పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్ పై పి. సంతోష్ రెడ్డి నిర్మాణంలో అమర్ దీప్, లిషి గణేష్ కల్లపు జంటగా సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘నా నిరీక్షణ’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో చైతన్య వర్మ, రమ్య ప్రియా.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిన్న దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

View this post on Instagram

A post shared by Surya Teja (@surya_teja__9)

నా నిరీక్షణ సినిమా పూజా కార్యక్రమాలకు దిల్ రాజు, సురేష్ బాబు, రాజా రవీంద్ర.. పలువురు గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా అమర్ దీప్ మాట్లాడుతూ.. హీరోగా ఇది నాకు రెండో సినిమా. బిగ్ బాస్ తరువాత సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. దర్శక, నిర్మాతలు ఈ సినిమా మీద ఏడు నెలలు పని చేశారు అని తెలిపారు.