BiggBoss 6 Day 53 new captain in House
BiggBoss 6 Day 53 : ఈ వారం బిగ్‌బాస్ లో కెప్టెన్సీ కోసం ఒక్కొక్కరు రెచ్చిపోయి ఆడారు. కొట్టుకుంటూ, తోసుకుంటూ, తిట్టుకుంటూ మరీ ఆడారు. ఇక గీతూ అయితే తన శాడిజం మొత్తం చూపించింది. ఈ టాస్కుల్లో తాను గెలవకపోయినా పర్వాలేదు గాని తనని ఓడించే వాళ్ళు మాత్రం గెలవకూడదు అని చాలా చీప్ గా ఆలోచించి గేమ్ ఆడింది. హౌజ్ లో కంటెస్టెంట్స్ కూడా గీతూని తిట్టుకున్నారు. చివరి కెప్టెన్సీ టాస్క్ కి ముందు గీతూ వల్ల చేపలు ఎక్కువ ఉండి శ్రీ సత్య, శ్రీహన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. వాళ్ళతో పాటు మిగిలిన జంటల్లో కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ కి ఒక్కొక్కరు వారే సెలెక్ట్ చేసుకొని పంపమన్నాడు బిగ్‌బాస్. దీంతో రేవంత్- ఇనయ జోడీ నుంచి రేవంత్, సూర్య- వాసంతి జంట నుంచి సూర్య, రోహిత్- కీర్తి జంట నుంచి కీర్తి, ఫైమా- రాజ్ జోడీ నుంచి ఫైమాలు వచ్చారు.
ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ కి కంటే ముందు కంటెండర్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు. కుప్పలుగా, ముడులతో ఉన్న తాళ్లు ఇచ్చి వాటి చిక్కులన్నీ విప్పి స్ట్రైట్ గా చుట్టమన్నాడు బిగ్‌బాస్. ఈ పోటీలో శ్రీహన్, శ్రీసత్య, రేవంత్, సూర్య, కీర్తి, ఫైమాలు పాల్గొనగా ఆ తాళ్లు ముడులు తొందరగా విప్పి కీర్తి, సూర్య, శ్రీహన్ ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ కి వెళ్లారు. ఫైనల్ టాస్క్ లో ఇంటి సభ్యులని ఆ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ గా వద్దు అనుకుంటున్నారో వారికి కత్తిపోట్లు గుచ్చాలని చెప్పారు. దీంతో కీర్తి, సూర్యకి ఎక్కువ కత్తిపోట్లు వచ్చాయి. శ్రీహన్ కి చాలా తక్కువ రావడంతో శ్రీహాన్ ని కెప్టెన్ గా అనౌన్స్ చేసాడు బిగ్‌బాస్.
BiggBoss 6 Day 52 : వామ్మో గీతూ మరీ ఇంత శాడిజమా.. తను గెలవదు, పక్కనవాళ్ళని గెలవనివ్వదు
అయితే ఇనయా శ్రీహన్ కి కత్తి గుచ్చడంతో శ్రీహన్ బాగా హర్ట్ అయ్యాడు. ఇనయా అన్ని నాటకాలు ఆడుతుంది. అయితే సూర్య, కాకపోతే నేను తన గేమ్ కి తగ్గట్టు మార్చుకుంటుంది. ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో, ఈ సారి చూపిస్తాను అని సీరియస్ అయ్యాడు శ్రీహన్.