BiggBoss 6 Day 92 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా??

 బిగ్‌బాస్ సీజన్ 6 చివరికి వచ్చేసింది. 21 మందితో మొదలైన ఈ ఆరో సీజన్ లో ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు మిగిలారు. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్‌, శ్రీహాన్‌, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ ఉన్నారు. ఇందులో శ్రీహాన్‌ ఆల్రెడీ ఫైనల్‌కి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే సోమవారం నాడు...........

BiggBoss 6 Day 92 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా??

BiggBoss 6 Day 92 nominations for this week BiggBoss 6 Day 92 nominations for this week

BiggBoss 6 Day 92 :  బిగ్‌బాస్ సీజన్ 6 చివరికి వచ్చేసింది. 21 మందితో మొదలైన ఈ ఆరో సీజన్ లో ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు మిగిలారు. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్‌, శ్రీహాన్‌, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ ఉన్నారు. ఇందులో శ్రీహాన్‌ ఆల్రెడీ ఫైనల్‌కి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. శ్రీహాన్ ఆల్రెడీ ఫైనల్ కి వెళ్లిపోవడంతో నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో మిగిలిన ఆరుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

BiggBoss 6 Day 91 : బిగ్‌బాస్‌‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??

రేవంత్‌, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ లు ఈ వారం నామినేషన్స్ లో నిలిచారు. మరి ఈ వీకెండ్ వీరిలోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అలాగే ఇంటి సభ్యులకి రకరకాల టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్. హౌజ్ లో ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు అని అందర్నీ చెప్పమన్నాడు. ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరికి ఒక్కో స్థానం ఇచ్చారు. ఓవరాల్ గా రేవంత్‌ మొదటి స్థానం, శ్రీహాన్‌ రెండో స్థానం, ఆదిరెడ్డి మూడు, ఇనయ నాలుగు, శ్రీ సత్య ఐదు, రోహిత్‌ ఆరు, కీర్తికి ఏడో స్థానం దక్కాయి.